'పీడీఏ పాఠశాలల'పై యూపీ సీఎం ఆగ్రహం

మొరాదాబాద్‌ బహిరంగ సభలో సమాజ్ వాదీ పార్టీ నేతల వ్యాఖ్యలకు కౌంటర్..;

Update: 2025-08-07 11:42 GMT
Click the Play button to listen to article

ఉత్తర్‌ప్రదేశ్‌(Utter Pradesh)లో పాఠశాలల విలీనం రాజకీయ వివాదానికి కేంద్ర బిందువైంది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది. విద్యార్థుల సంఖ్య 50 కంటే తక్కువ ఉన్న పాఠశాలలను సమీప పాఠశాలలో విలీనం చేయాలని అధికార పార్టీ నిర్ణయించింది. అయితే సీఎం యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) నిర్ణయాన్ని ప్రతిపక్షాలు తప్పుబడుతున్నాయి. మొరాదాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో వారికి కౌంటర్ ఇచ్చారు. బీజేపీ ప్రభుత్వం పిల్లలకు "గణేష్ కోసం జి" అని నేర్పుతుందని, కానీ ఎస్పీ అధికారంలో ఉన్నప్పుడు "గాధ కోసం జి" అని ప్రచారం చేసిందని అన్నారు. డబుల్ ఇంజిన్ సర్కారు విద్యార్థులకు మెరుగైన విద్యా సౌకర్యాల కల్పనకు కృషిచేస్తుంటే.. సమాజ్‌వాదీ పార్టీ అనవసరంగా రాజకీయం చేయాలని చూస్తోందని ఆరోపించారు.


సమాజ్‌వాదీ పార్టీ(SP) PDA పాఠశాలలు..

ఇదిలా ఉండగా.. అణగారిన వర్గాల విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని సమాజ్‌వాదీ పార్టీ PDA (పిచ్డా, దళిత, అల్పసంఖ్యాక్) పాఠశాలలను ప్రారంభించింది. ఆ పార్టీ నాయకులు వివిధ జిల్లాల్లో ఈ పాఠశాలలను తెరిచి పిల్లలకు వ్యక్తిగతంగా బోధిస్తున్నారు. ప్రతాప్‌గఢ్ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాల తాళాన్ని పగలగొట్టి అక్కడ PDA పాఠశాలను నడుపుతున్నారన్న ఆరోపణలతో సమాజ్‌వాదీ పార్టీ MLA RK వర్మపై కేసు నమోదైంది. సహారన్పూర్ నుంచి కాన్పూర్ వరకు నడుస్తు్న్న కొన్ని PDA పాఠశాలల్లో "A ఫర్ అఖిలేష్" అని బోధిస్తుండడం రాజకీయం వివాదానికి దారితీసింది.


‘విద్యను దూరం చేయాలనే..’

పాఠశాలల విలీనాన్ని సమాజ్‌వాదీ పార్టీ వ్యతిరేకిస్తూనే ఉంది. ఆ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఇటీవల సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో ఇలా పోస్టు చేశారు. “PDA కమ్యూనిటీ పిల్లలను చదువుకు దూరం చేయాలని చూస్తోంది. ఆ ఉద్దేశ్యంతోనే బీజేపీ యోగి ప్రభుత్వం పాఠశాలలను మూసివేయాలని చూస్తోంది” అని ఆరోపించారు. సమాజ్‌వాదీ పార్టీ రాబోయే ఎన్నికల మేనిఫెస్టోలో PDA పాఠశాలల అంశాన్ని కూడా చేర్చే అవకాశం కనిపిస్తోంది. 

Tags:    

Similar News