ఉత్తరాఖండ్: హరిద్వార్ ఆలయ మెట్ల తొక్కిసలాట
ఆరుగురు మృతి, పలువురికి గాయాలు..;
ఉత్తరాఖండ్(Uttarakhand) రాష్ట్రం హరిద్వార్(Haridwar,)లోని మానసాదేవి ఆలయ మెట్ల వద్ద ఆదివారం (జూలై 2) తొక్కిసలాట(Stampede) జరిగింది. ఆదివారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా, మరో 35 మందిని గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. ఆలయం మెట్ల వద్ద కరెంట్ షాక్ కొడుతుందన్న వదంతులు వ్యాపించడంతో తొక్కిసలాట జరిగిందని హరిద్వార్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ప్రమేంద్ర సింగ్ దోబాల్ తెలిపారు. క్షతగాత్రులను వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించామని చెప్పారు. రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం, అగ్నిమాపక దళం ఘటనా స్థలంలో సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి.
ఈ ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి విచారం వ్యక్తం చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నామని ఆయన చెప్పారు.
"హరిద్వార్‌లోని మానసా దేవి ఆలయానికి వెళ్లే మార్గంలో తొక్కిసలాట జరిగినట్లు వార్తలొస్తున్నాయి. SDRF, స్థానిక పోలీసులు, సహాయక పన్నుల్లో ఉన్నాయి. స్థానిక అధికారులతో ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నాను. భక్తులంతా క్షేమంగా ఉండాలని దేవున్ని కోరుకుంటున్నా" అని ధామి సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.