బీహార్ ఎన్నికలు: ఎగ్జిట్ పోల్స్‌లో ఎన్డీయేకు ఆధిక్యం ..
అసెంబ్లీ ఎన్నికల రెండవ, చివరి దశ పోలింగ్ ముగిసే సమయానికి అత్యధికంగా 67.14 శాతం పోలింగ్ నమోదైంది.
By : The Federal
Update: 2025-11-11 14:05 GMT
బీహార్(Bihar) అసెంబ్లీ ఎన్నికలు(Assembly Polls) ముగిశాయి. మంగళవారం సాయంత్రం 6 గంటలకు పోలింగ్ పూర్తవ్వడంతో ఎగ్జిట్ పోల్స్(Exit polls) వెలువడ్డాయి. బీజేపీ(BJP), జేడీ(యూ)JD(U) నేతృత్వంలోని అధికార నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) కు ఆధిక్యాన్ని ఇచ్చాయి. ఇదే సమయంలో ఆర్జేడీ, కాంగ్రెస్‌తో కూడిన ప్రతిపక్ష మహాఘటబంధన్‌ను రెండో స్థానంలో నిలిపాయి.
ముఖ్యమంత్రి నితీష్ కుమార్(Nitish Kumar) నాయకత్వంపై ఎన్నో కథనాలు వచ్చాయి. కూటమి అధికారాన్ని నిలుపుకుంటే బీజేపీ ఆయనకు మరోసారి మద్దతు ఇస్తుందా? అన్న ఊహాగానాల నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ ఎన్‌డీఏకు అనుకూలంగా వచ్చాయి.