‘ఢిల్లీలో కారు పేలుడు భద్రతా లోపం, నిఘా వైఫల్యాన్ని బయటపెట్టింది’

TMC జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ..

Update: 2025-11-11 11:40 GMT
Click the Play button to listen to article

ఢిల్లీలో జరిగిన పేలుడు అంతర్గత భద్రతా లోపాలను ఎత్తిచూపుతోందని టీఎంసీ సీనియర్ నాయకుడు అభిషేక్ బెనర్జీ విమర్శించారు. సోమవారం సాయంత్రం ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలోని ట్రాఫిక్ సిగ్నల్ వద్ద కారులో శక్తివంతమైన పేలుడు సంభవించడంతో 12 మంది చనిపోయిన విషయం తెలిసిందే.

‘ఘటన తీవ్రంగా బాధించింది..’

‘‘ఘటన కలిచివేసింది. తీవ్ర మనోవేదనకు గురయ్యా. మృతులకు నా సంతాపం. కుటుంబసభ్యులను కోల్పోయిన వారికి సానుభూతి తెలియజేస్తున్నా. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా, "అని ఎక్స్ వేదికగా TMC జాతీయ ప్రధాన కార్యదర్శి బెనర్జీ పోస్టు చేశారు.

జాతీయ రాజధానిలో భద్రతా గురించి ప్రస్తావిస్తూ.. కేంద్ర హోం మంత్రిత్వ శాఖపై నిప్పులు చెరిగారు.

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కింద పనిచేసే ఢిల్లీ పోలీసులు శాంతిభద్రతల పరిరక్షణలో ఘోరంగా వైఫల్యం చెందారని, ఇలాంటి లోపాలను ఎలా అనుమతిస్తున్నారు?" అని లోక్‌సభ ఎంపీ ప్రశ్నించారు.

నవంబర్ 9న హర్యానాలోని ఫరీదాబాద్‌లో దాదాపు 350 కిలోల పేలుడు పదార్థాలు, ఒక అస్సాల్ట్ రైఫిల్ స్వాధీనం చేసుకున్న విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు.. ఈ రెండు ఘటనలను కలిపి చూసినప్పుడు.. "అంతర్గత భద్రత, నిఘా లోపం స్పష్టంగా కనిపిస్తున్నాయి, ’’ అని పేర్కొన్నారు.

"సత్యాన్ని వెలికితీసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. అవసరమైతే కోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)తో దర్యాప్తు చేయించాలి" అని డిమాండ్ చేశారు అభిషేక్.

Tags:    

Similar News