‘గెలిచాక అందరి సంగతి చూస్తా’

ఎన్నికల నిబంధనను తుంగలో తొక్కుతూ జూబ్లీహిల్స్ కాంగ్రెస్ నాయకులు రౌడీయిజం చేస్తున్నారన్న మాగంటి సునీత.

Update: 2025-11-11 10:14 GMT

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు రౌడీ యిజం చేస్తున్నారని బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఆరోపించారు. ఓటర్లను భయబ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. ఒకవైపు పోలింగ్ జరుగుతున్నా కాంగ్రెస్‌ నేతలు ప్రచారం చేసుకుంటున్నారని, ఓటర్లను తమకే ఓటేయాలని కోరుతున్నారని తెలిపారు. ఒకవరైనా ఓటరు మాట వినకుంటే బూతులు తిట్టి బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. నాన్‌లోకల్ నేతలు పోలింగ్ జరుగుతున్న రోజులు కూడా నియోజకవర్గంలో తిరుగుతూ ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని అన్నారు. పోలీసులు కూడా అధికార పార్టీ వారికే వత్తాసు పలుకుతున్నారంటూ ఆమె వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్‌కు ఓటమి భయం..

‘‘కాంగ్రెస్‌కు ఓటమి భయం పట్టుకుంది. స్టేట్‌లో ఉన్న ఆకురౌడీలంతా ఇప్పుడు జూబ్లీహిల్స్‌లోనే తిరుగుతున్నారు. సురేశ్ యాదవ్ అనే వ్యక్తం అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులకు జూబ్లీహిల్స్ ఏం పని ఉంది. వాళ్లు ఇక్కడ ఎందుకు తిరుగుతున్నారు. పోలీంగ్ కేంద్రాల దగ్గర బీఆర్ఎస్ ఏజెంట్లను కూర్చోను కూడా కూర్చోనివ్వడం లేదు. బీఆర్ఎస్ ఏజెంట్ల టేబుళ్లను పడేస్తున్నారు. ఇందులో పోలీసులు కూడా కాంగ్రెస్ వాళ్లకే మద్దతుగా ఉంటున్నారు. బీర్యానీలో డబ్బులు పెట్టి ఓటర్లకు అందిస్తున్నారు. బిర్యానీ ప్యాకెట్లను చూసి పోలీసులు కూడా వదిలేస్తున్నారు. కొన్ని పోలింగ్ బూత్‌లలో రిగ్గింగ్ జరుగుతోంది. వికలాంగులకు వీల్‌చైర్స్ కూడా సరిపడా పెట్టలేదు. రజియా అనే అమ్మాయి ఇంటికి వెళ్లి దాడులు చేశారు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఓటర్లు కదలి రావాలి..

‘‘పోలింగ్‌కు ఇంకా సమయం ఉంది. ఓటర్లు బయటు రావాలి. ఓట్లు చైతన్యం ప్రదర్శించి ఓటు హక్కును వినియోగించుకోవాలి. నియోజకవర్గాన్ని రౌడీ రాజ్యంగా మార్చేశారు. నవీన్ యాదవ్ మనుషులు నన్నే బెదిరించారు. ఇలాంటి రైడీ రాజ్యాన్ని ఎదుర్కోవాలంటే కేసీఆర్ పార్టీని గెలిపించాలి. నా భర్త మాగంటి గోపీనాథ్ ఎన్నో ఎన్నికల్లో పోటీ చేారు. కానీ ఇంత దౌర్జన్యం ఎప్పుడూ చూడలేదు. 13 వరకు ఎన్ని కుట్రలు చేస్తారో చేయండి. 14న నేను గెలిచిన తర్వాత అందరి సంగతి చూస్తా. ప్రజలందరికీ బీఆర్ఎస్ అండగా ఉంటుంది’’ అని తెలిపారు.

Tags:    

Similar News