‘203 5‌ కల్లా ఆకాశంలో ఇండియాకు సొంత ‘గూడు’

ఇస్రో చీఫ్ వి. నారాయణన్..;

Update: 2025-07-25 09:44 GMT
Click the Play button to listen to article

రానున్న మూడేళ్లలో భారతదేశం(India) ఉపగ్రహాల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని ఇస్రో(ISRO) చైర్మన్ వి. నారాయణన్(V Narayanan) తెలిపారు. ప్రస్తుతం ఉన్న 55 శాటిలైట్ల(Satellites) సంఖ్యను 150కి పెంచుతామని చెప్పారు.

'భారత అంతరిక్ష విజయాలు, సవాళ్లు, భవిష్యత్ ప్రణాళికలపై హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ..ఈ సంవత్సరం ఇస్రో 12 లాంచ్ వెహికల్ మిషన్లను ప్లాన్ చేసిందని చెప్పారు. నాసా-ఇస్రో సింథటిక్ ఎపర్చర్ రాడార్ (NISAR) జూలై 30న భారతదేశ GSLV F16 నుంచి ప్రయోగిస్తామని పేర్కొన్నారు. 2040 నాటికి భారతదేశం అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానంలో ఇతర దేశాలతో పోటీపడుతుందన్నారు.


‘2035 నాటికి..’

"ప్రస్తుతం సొంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటుచేసే పనిలో నిమగ్నమై ఉన్నాం. ప్రస్తుతం వివిధ కక్ష్యల్లో ఉన్న 55 ఉపగ్రహాలు తమ సేవలందిస్తున్నాయి. భవిష్యత్ అవసరాల దృష్ట్యా మరో మూడేళ్లలో వీటి సంఖ్య దాదాపు మూడు రెట్లు పెరగాలి. సొంతంగా వాటిని తయారుచేసుకోవాలి. ఆ దిశగా కృషి చేస్తున్నాం,”అని చెప్పారు. 2035 లో భారతదేశం పూర్తి అంతరిక్ష కేంద్రాన్ని నిర్మిస్తుందని, మొదటి మాడ్యూల్‌ను 2028 లో కక్ష్యలో ఉంచుతామని పేర్కొన్నారు. 

Tags:    

Similar News