రాజకీయాలకు గుడ్‌బై చెప్పిన లాలూ కుమార్తె రోహిణి ఆచార్య ..
ఎన్నికలలో RJD పరాభవమే కారణమా?
రాష్ట్రీయ జనతాదళ్ (RJD) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) కుమార్తె రోహిణి ఆచార్య పాలిటిక్స్‌కు గుడ్‌బై చెప్పారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ ఓటమి పాలైన తర్వాతి రోజే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ సీనియర్ నాయకుడు సంజయ్ యాదవ్ సలహా మేరకు తాను నడుచుకుంటున్నానని 'ఎక్స్'లో పోస్టు చేశారు.
I’m quitting politics and I’m disowning my family …
— Rohini Acharya (@RohiniAcharya2) November 15, 2025
This is what Sanjay Yadav and Rameez had asked me to do …nd I’m taking all the blame’s
తేజ్ బహిష్కరణ బాధించిందా?
తేజ్ ప్రతాప్ ఒక మహిళతో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో లాలూ ప్రసాద్ యాదవ్.. తన పెద్ద కొడుకును పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత తేజ్ ప్రతాప్ జనశక్తి జనతాదళ్‌ను స్థాపించి తాను మహువా నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. కాని ఓడిపోయారు. ఆయన పార్టీ నుంచి ఏ ఒక్కరూ కూడా గెలవలేదు. తేజ్ ప్రతాప్ బహిష్కరణపై ఆచార్య కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 25 సీట్లు మాత్రమే గెలుచుకున్న ఆర్జేడీకి ఆమె ఇటీవల మద్దతు ప్రకటించారు.