అస్సాం ప్రభుత్వానికి తలంటిన ‘ కాగ్’.. తేయాకు తోటల్లో..

అస్సాంలో తేయాకు తోటల్లో పని చేసే కార్మికుల పరిస్థితి దుర్భరంగా ఉందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదిక వెల్లడించింది. ప్రభుత్వ తీసుకునే నిర్ణయాలు..

Update: 2024-09-01 09:27 GMT

ఈశాన్య భారతంలో పెద్ద రాష్ట్రమైన అస్సాంలో తేయాకు తోటల కార్మికుల పరిస్థితి బాగాలేదని కంప్ట్రోలర్ అండ్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదిక వెల్లడించింది. తేయాకు తోటలోని కార్మికులు "అత్యల్ప" వేతనాలను పొందుతున్నారని తెలియజేసింది. కార్మిక చట్టాలు, కార్మికుల సంక్షేమ నిబంధనల అమలులో "అనేక లోపాలు, ఆందోళన కలిగించే ప్రాంతాలు" ఉన్నాయని పేర్కొంది.

కనీస వేతన చట్టం (MW చట్టం) ప్రకారం వేతనాలను నిర్ణయించడంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే చర్యలు "సరిపోవట్లేదు" అని కూడా కాగ్ గుర్తించింది. కార్మికుల జీవితాలను మెరుగుపరిచే ప్రయత్నాలు అన్ని విఫలం అవుతున్నాయని, ఇవి సరియైన విధానం అస్సాం ప్రభుత్వానికి తలంటింది. 
తక్కువ ఆదాయం
2015-16 నుంచి 2020-21 మధ్య కాలంలో 'టీ ట్రైబ్ సంక్షేమం కోసం పథకాల అమలు'పై పనితీరు ఆడిట్ రాష్ట్రంలోని కార్మికుల సమగ్ర అభివృద్ధికి తక్కువ ఆదాయం, విద్య లేమి ప్రధాన అవరోధంగా ఉందని పేర్కొంది.
కాచర్, దిబ్రూగర్, నాగాన్, సోనిత్‌పూర్ అనే నాలుగు జోన్‌లలో ఆడిట్ జరిగింది. నాలుగు జోన్‌లలో 390 టీ ఎస్టేట్‌లు ఉన్నాయి, వాటిలో 40 ఎస్టేట్‌లు (10 శాతం) తోటల పరిమాణం, పని చేస్తున్న కార్మికుల సంఖ్య ఆధారంగా ఎంపిక చేశారు.
రికార్డుల పరిశీలనతో పాటు ఎంపిక చేసిన ఎస్టేట్‌లలోని 590 మంది కార్మికుల ఇంటర్వ్యూలు కూడా తీసుకున్నారు. టీ ట్రైబ్స్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ (టిటిడబ్ల్యుడి) కార్మికుల సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించిందని, అయితే ప్రాథమిక సామాజిక-ఆర్థిక డేటా లేకుండా, వారి కార్యక్రమాలు అమలు జరిగాయని పేర్కొన్నారు
అరకొర వేతనాలు
"టీ ఎస్టేట్‌లలో కార్మికులు పొందే వేతనాలు చాలా తక్కువగా ఉన్నాయి" అని నివేదిక పేర్కొంది, అస్సాం ప్రభుత్వం MW చట్టం, 1948 ప్రకారం కనీస వేతనాన్ని నిర్ణయించలేదు.
రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసిన షెడ్యూల్డ్ ఎంప్లాయిమెంట్స్‌లో కార్మికులు భాగం కాదని, దీని ఫలితంగా వారికి కనీస వేతన ప్రమాణాలు, వేరియబుల్ డియర్‌నెస్ అలవెన్స్ ప్రయోజనాలు లభించడం లేదని కూడా పేర్కొంది.
MW చట్టం ప్రకారం వేతనాలు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం చొరవతో ముందుకు వచ్చినప్పుడు, అది కోర్టులో సవాలు చేయబడిందని, అందువల్ల, కోరుకున్న విధంగా వేతనాలు పెంచలేమని కార్మిక, సంక్షేమ శాఖ కార్యదర్శి కాగ్‌కి తెలియజేశారు.
అసమానత
ఈ నివేదిక బరాక్, బ్రహ్మపుత్ర లోయ కార్మికుల మధ్య వేతనాల అసమానతను నొక్కిచెప్పింది. కార్మిక శాఖ దీనికి "ఏ విధమైన సమర్థనను అందించలేదు" అని పేర్కొంది. బరాక్ లోయలోని కార్మికులు బ్రహ్మపుత్ర వ్యాలీ కార్మికుల కంటే "కనీసం 10 శాతం తక్కువ" వేతనం పొందుతున్నారని, సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని పేర్కొంది.
Tags:    

Similar News