500 యేళ్ల అయ్యోధ్య రామాలయ రగడ మీద డాక్యుమెంటరీ...
బాలరాముడు అయోధ్యలో కాలుమోపేందుకు 500 యేళ్లు పట్టిందంటున్నారు దర్శకుడు ప్రియదర్శన్. ఐదు భాగాలుగా అయోధ్య డాక్యుమెంటరీని ఆయన సిద్ధం చేస్తున్నారు...
ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ అయోధ్య రామమందిర చరిత్రను ఐదు భాగాలుగా డాక్యుమెంటరీ పూర్తి చేశారు. మీడియాకు విడుదల చేసిన ఓ ప్రకటనలో ఈ మేరకు ప్రియదర్శన్ వివిరంచారు. ఆలయ చరిత్రను డాక్యుమెంటరీ రూపంలో తీయడానికి తనకు ఆహ్వానం అందిందని వివరించారు.
ఈ ఆహ్వానాన్ని నేను సంతోషంగా స్వీకరించాను. ఎంతో ఉత్సాహంతో పని చేశానన్నారు. స్క్రిప్ట్ “చాలా ఆసక్తికరంగా” ఉందని, గత 500 సంవత్సరాల ఆలయ చరిత్ర, “రాముడు తన పవిత్ర జన్మస్థలానికి తిరిగి రావడానికి చేసిన తీవ్రమైన పోరాటాన్ని” డాక్యుమెంట్-సిరీస్ ప్రదర్శిస్తుందని వెల్లడించారు.
ఈ డాక్యుమెంట్-సిరీస్‌ని రూపొందించడానికి దూరదర్శన్‌తో ప్రియదర్శన్ భాగస్వామ్యం అయ్యారు. ఇందుకోసం 60 రోజుల పాటు నిరంతరాయంగా భక్తితో పనిచేసినట్లు తెలిపారు. ఆలయ నిర్మాణం కావడానికి జరిగిన ప్రయత్నాలు, ప్రయాణాలు ప్రభావంతంగా చిత్రీకరించడానికి చాలా జాగ్రత్తగా పనిచేశానని ప్రియదర్శన్ వివరించారు.