అయోధ్యలో ఈ అమ్మాయి స్పెషాలిటీ ఏంటంటే..

2021లో ఓ జైలులో ఉన్న ఖైదీలకు రాముడి కథలను చెప్పగా వారు రూ.లక్ష విరాళం ఇచ్చారు. అలా భవికా తాను 11 ఏళ్ల వయసు నుంచి సామాజిక సేవలో నిమగ్నమయ్యారు..

Update: 2024-01-22 04:35 GMT
భవికా

శ్రీరాముడికి ఎవరికి తోచిన రీతిలో వాళ్లు సాయం అందిస్తున్నారు. పూలు, పండ్లు, విగ్రహాలు, బంగారు ఆభరణాలు, నగదు నట్రా.. ఇలా ప్రతి ఒక్కరూ తమకున్న దాంట్లో పంచిపెడుతుంటే.. గుజరాత్‌కు చెందిన ఓ 14 ఏళ్ల బాలిక రామమందిర నిర్మాణం కోసం ఏకంగా రూ.52 లక్షల విరాళాలను సేకరించి ఇచ్చింది. ఇంత చిన్న వయసులో అంత నగదును సేకరించిన బాలికపై ప్రశంసలు వెల్లువెత్తున్నాయి.

భవికా నీ సేవ గొప్పదమ్మా..

సూరత్‌కు చెందిన 14 ఏళ్ల బాలిక భవికా మహేశ్వరి అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరుగుతోందని, దాని కోసం ప్రజలు తమకు తోచినంత విరాళాలు అందిస్తున్నారు. తాను కూడా ఆలయానికి విరాళం అందించాలని అనుకుంది. రామాయణం మీద ఉన్న ఆసక్తితో బాలరాముడి కథలు చదవడం ప్రారంభించింది. ఆ కథలను కొవిడ్‌ సెంటర్లు, బహిరంగ సభల్లో ప్రజలకు చెప్పింది.

ఖైదీల సేవలోనూ భవికా...

2021లో ఓ జైలులో ఉన్న ఖైదీలకు రాముడి కథలను చెప్పగా వారు రూ.లక్ష విరాళం ఇచ్చారు. అలా భవికా తాను 11 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి 50వేల కిలోమీటర్లు ప్రయాణించి 300పైగా ప్రదర్శనలు ఇచ్చింది. వాటి ద్వారా మొత్తంగా రూ.52 లక్షల వరకూ సేకరించి ఆ నగదును అయోధ్య రామాలయ నిర్మాణం కోసం ఇచ్చింది. కేవలం రాముడి గాథను ప్రదర్శించడమే కాకుండా 108కిపైగా వీడియోలను రికార్డు చేసి యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేసింది భవికా. ఆ వీడియోలను దాదాపు లక్ష మంది వీక్షించారు. అంతేకాకుండా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై ఒక పుస్తకాన్ని రాసింది. ఇప్పుడు ఏకంగా రాముడికి 52 లక్షల రూపాయలు వసూలు చేసి విరాళంగా అందజేశారు.

Tags:    

Similar News