ఎన్నికల ముందు బీజేపీ డర్టీ పాలిటిక్స్: ఢిల్లీ సీఎం
లోక్ సభ ఎన్నికలకు ముందు సీఏఏ అమలు చేసే కుట్రలకు బీజేపీ తెరలేపిందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు.
By : The Federal
Update: 2024-03-13 05:44 GMT
ఎన్నికల ముందు బీజేపీ ప్రభుత్వం డర్టీ పాలిటిక్స్ కు తెరలేపిందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. ఎన్నికల నోటిఫికేషన్ ముందు సీఏఏను అమలు చేసే కుట్రలకు పాల్పడుతోందని విమర్శించారు. ఈ చట్టంతో కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం పాకిస్థాన్, బంగ్లాదేశ్‌ల నుంచి పెద్ద సంఖ్యలో పేద మైనారిటీలు భారత్‌లోకి రావడానికి తెరలేపిందని ఆయన విలేకరుల సమావేశంలో ఆరోపించారు.
"పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్‌లలో 3.5 కోట్ల మంది మైనారిటీలు ఉన్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి పేద వలసదారులకు ఇక్కడ ఇళ్ళు ఉద్యోగాలు ఇవ్వడం ద్వారా మా ప్రజల డబ్బును ఖర్చు చేయాలని బిజెపి కోరుకుంటోంది" అని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అయిన కేజ్రీవాల్ ఆరోపించారు.
పొరుగు దేశాలకు చెందిన పేద మైనారిటీలు భారత్‌లో స్థిరపడడం వల్ల వచ్చే ఎన్నికల్లో బీజేపీకి లాభం చేకూరుతుందని అన్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు CAAని అమలు చేయడం బిజెపి యొక్క "డర్టీ పాలిటిక్స్ కు నిదర్శనం" అని కేజ్రీవాల్ అన్నారు.
సిఎఎను రద్దు చేయాలని దేశం డిమాండ్ చేస్తుందని, చట్టాన్ని రద్దు చేయకపోతే బిజెపికి వ్యతిరేకంగా ఓటు వేయాలని ప్రజలను కోరారు.
పౌరసత్వ సవరణ చట్టం డిసెంబర్ 31, 2014 కంటే ముందు భారతదేశానికి వచ్చిన పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి పత్రాలు లేని ముస్లిమేతర వలసదారులకు పౌరసత్వం మంజూరు చేయడానికి ప్రయత్నిస్తుంది.