లోక్ సభ స్పీకర్ కోసం బీజేపీ ఎలాంటి ఎత్తులు వేయబోతోంది?

లోక్ సభ లో స్పీకర్ పదవిని దక్కించుకోవడానికి బీజేపీ మిత్రపక్షాలతో సమావేశం కాబోతోంది. ఈ పదవి కోసం రెండు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అవేంటంటే..

Update: 2024-06-18 12:13 GMT

ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ లోక్ సభ లో సొంత బలం లేకపోవడంతో భాగస్వామ్య పక్షాల బలంతో ప్రభుత్వాన్ని నడుపుతోంది. అయితే లోక్ సభ లో కీలకమైన స్పీకర్ పదవి విషయంలో కూటమి సభ్యులతో చర్చలు జరపడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఢిల్లీ వీధుల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఒడిశా లేదా ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన బీజేపీ నాయకులకు ఈసారి స్పీకర్ పదవి దక్కుతుందని సంకేతాలు అందుతున్నాయి.

మోదీ కేబినెట్‌లోని మంత్రులు, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ)లోని బిజెపి మిత్రపక్షాల సమావేశం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇంట్లో జరగనుంది.
లోక్‌సభలో కేవలం 240 మంది సభ్యుల బలం మాత్రమే ఉన్న బీజేపీ స్పీకర్ పదవి దక్కాలంటే దాని మిత్రపక్షాల మద్ధతు అవసరం. గత దశాబ్దంలో బీజేపీకి సొంతంగా బలం రావడంతో ఎవరి మద్ధతు లేకుండానే స్పీకర్ పదవిని సొంతం చేసుకుంది.
అయితే ఇప్పుడు కీలకమైన స్పీకర్ పదవి దక్కాలంటే మిత్రపక్షాల మద్ధతు అవసరం. సభ లో సాధారణ మెజారిటీ ఎంపీల ఓటింగ్ ద్వారానే స్పీకర్ ఎన్నిక అనేది ఉంటుంది. ప్రస్తుతం ఈ పదవికి తనకు కావాలని టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కోరుకుంటున్నారని సమాచారం. అలా కానీ పక్షంలో ఏపీ బీజేపీ చీఫ్ పురంధరేశ్వరికి అయినా ఈ పదవి ఇవ్వాలని కోరినట్లు కొన్ని వార్తలు ప్రచారంలో ఉన్నాయి. దీనితో పాటు ఒడిశాకు చెందిన భట్రుహరి మహతాబ్ కూడా స్పీకర్ పదవి రేసులో ఉన్నారు.
మహతాబ్ బిజూ జనతా దళ్ (బిజెడి) మాజీ సభ్యుడు, ఇప్పుడు బిజెపిలో ఉన్నారు. పురందేశ్వరి ఆంధ్రప్రదేశ్‌లో బిజెపికి నాయకత్వం వహిస్తున్నారు. పురంధరేశ్వరి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి భార్యకు స్వయానా అక్కయ్య. జూన్ 26న లోక్‌సభ స్పీకర్ అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్ సభలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు.
Tags:    

Similar News