ఇందిరాగాంధీ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ ఎమ్మెల్యేల నిరసన

క్షమాపణ చెప్పేదాక ధర్నా విరమించేది లేదని భీష్మించుకుని కూర్చున్న ఎమ్మెల్యేలు;

Update: 2025-02-23 08:04 GMT

రాజస్థాన్ అసెంబ్లీలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీపై మంత్రి అవినాష్ గెహ్లట్ చేసిన వ్యాఖ్యలపై వివాదం చెలరేగింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో కూర్చుని ధర్నా నిర్వహించారు. సభ వాయిదా పడిన తరువాత కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సభ లో బైఠాయించారు.

మంత్రి వ్యాఖ్యలు సభ నుంచి తొలగించాలని అన్నారు. పీసీసీ అధ్యక్షుడు గోవింద్ సింగ్ దోతస్రాతో పాటు ఆరుగురు ఎమ్మెల్యేలపై విధించిన సస్పెన్షన్ ను ఎత్తి వేయాలని కూడా డిమాండ్ వ్యక్తం చేశారు.

తమ డిమాండ్ నెరవేర్చకపోతే ధర్నా కొనసాగిస్తామని ప్రతిపక్ష నాయకుడు టీకారం జుల్లీ ఆదివారం అన్నారు. ఈ ప్రతిష్టంభన కొనసాగించడానికి ప్రభుత్వానికి ఇష్టం లేదని, మంత్రులు లాంఛనాల కోసమే అసెంబ్లీలో ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో చర్చలు జరపాలని ఆయన డిమాండ్ చేశారు.
శనివారం రాత్రి సహాయమంత్రి జవహార్ సింగ్, పార్లమెంటరీ వ్యవహరాల మంత్రి జోగరం పటేల్ సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలలను కలిశారు. కానీ చర్చలు అసంపూర్తిగా మిగిలిపోయాయి. రాత్రి కూడా మంత్రులు ప్రతిపక్ష నేతలు జుల్లీ ఇతర సీనియర్ నాయకులతో చర్చలు జరిపిన అవి అసంపూర్తిగా మిగిలిపోయాయి.
రాజస్థాన్ అసెంబ్లీలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో సామాజిక న్యాయం, సాధికారిత మంత్రి అవినాష్ గెహ్లట్ ప్రతిపక్షాలను ఎత్తి చూపుతూ 2023-24 బడ్జెట్ల వర్కింగ్ ఉమెన్స్ హస్టళ్ల పథకానికి మీ నాన్న అమ్మమ్మ ఇందిరాగాంధీ పేరు పెట్టారని అన్నారు. ఈ వ్యాఖ్యలు సభలో తీవ్ర గందరగోళానికి దారితీసింది. సభ మూడు సార్లు వాయిదా పడింది.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గోవింద్ సింగ్ దోతసార, రామ్ కేష్ మీనా, అమీన్ కాగ్జీ, జాకీర్ హుస్సేన్, హకమ్ అలీ, సంజయ్ కుమార్ లను సస్పెండ్ చేయాలని ప్రతిపాదనను ప్రభుత్వ చీఫ్ విప్ జోగేశ్వర్ గార్గ్ ప్రవేశపెట్టగా, మూజువాణీ ఓటుతో ఆమోదించారు. సభ వాయిదా పడిన తరువాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సభలో ధర్నా ప్రారంభించారు.
అసెంబ్లీ వెలుపల విలేకరులతో మాట్లాడిన ప్రతిపక్ష ఎమ్మెల్యే ప్రభుత్వం ప్రతిష్టంభన తొలగిపోవాలని కోరుకోవడం లేదన్నారు. ‘‘మొదటి రోజు మేము ఈ సమస్యను ముగించడానికి సిద్దంగా ఉన్నాం. మంత్రి వ్యంగ్య స్వరంతో చేసిన వ్యాఖ్యలను తొలగించాలని, మా ఆరుగురు ఎమ్మెల్యేల సస్పెన్షన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. కానీ బీజేపీ మంత్రిని కాపాడటంతో బిజిగా ఉంది.
‘‘పార్లమెంటీర ప్రజాస్వామ్యంలో ఇది మంచిది కాదు. ఇక్కడ పోరాటం సైద్దాంతికమైనది. కానీ అధికార పార్టీ మొండితనం, అహాంకారంతో నిండి ఉంది. ’’ అన్నారు.
Tags:    

Similar News