ప్రత్యేకహోదా రాకపోయినా బీహార్‌కు బాగానే గిట్టింది:రు.59 వేలకోట్ల సాయం!

కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో బిహార్ కు నిధుల వరద పారింది. ఏకంగా రూ. 59 వేల కోట్లు మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం కేంద్రం కేటాయించింది.

Update: 2024-07-24 05:53 GMT

కేంద్ర ప్రభుత్వం మంగళవారం బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. మూడో సారి అధికారంలోకి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ ఆ సారి పూర్తి స్థాయి మెజారిటీని సాధించలేకపోయింది. అందుకే నితిష్ కుమార్, చంద్రబాబు నాయుడు లపై మద్ధతుపై ప్రభుత్వ మనుగడ ఆధారపడి ఉంది.

ఈ రెండు రాష్ట్రాలు చాలా సంవత్సరాలుగా ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తున్నాయి. అవి ఇవ్వడం సాధ్యం కాదని తెలిసిన ఎక్కువ నిధులు పొందెందుకు ఈ నినాదం ఉపయోగపడుతుందని వాటికి తెలుసు. ఈ అంచనాలకు తగ్గట్లుగానే నిన్న ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో బీహార్ కి నిధుల వరద పారించింది. ఏకంగా 59 వేల కోట్ల విలువైన ప్రత్యేక అభివృద్ధి పథకాలకు నితీష్ నిధులు సాధించుకున్నారు. దీంతో ఇక ప్రత్యేక హోదా నినాదాన్నే సమాధి చేసినట్లు సమాధి చేశారని చెప్పవచ్చు.

మంగళవారం (జూలై 23) లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ప్రత్యేక పథకాల దృష్ట్యా ప్రత్యేక కేటగిరీ హోదా డిమాండ్‌ను ప్రస్తుతానికి విరమించుకున్నట్లు ముఖ్యమంత్రి నితిష్ కుమార్ ఫెడరల్‌తో చెప్పారు.
"బీహార్‌కు ప్రయోజనాలను పొందాలనే ఉద్దేశ్యం"
“ బీహార్‌ కోసం ఆవిష్కరించిన పథకాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు నేను చాలా కృతజ్ఞతలు. ఇది కచ్చితంగా రాష్ట్రంలో అభివృద్ధి వేగాన్ని ఉరుకులు పెట్టిస్తుంది. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా భవిష్యత్తులో కూడా కేంద్రం బీహార్‌కు సాయాన్ని కొనసాగిస్తుందని ఆశిస్తున్నాను,” అని ఆయన అన్నారు.
బీహార్ కోసం తాను ప్రత్యేక సాయం కోరుతున్నానని, కేంద్రం అనేక అభివృద్ధి ప్రాజెక్టులు, పథకాలను ప్రకటించిందని నితీష్ అన్నారు. "అదనపు కేటాయింపులతో బీహార్‌కు ప్రయోజనాలను పొందడమే మా ఉద్దేశం" అని ఆయన చెప్పారు.
ప్రత్యేక హోదా డిమాండ్ సజీవంగా ఉంటుందా అనే ప్రశ్నకు, “మేము ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తున్నాము, కానీ అది చాలా కాలం క్రితమే పక్కకు వెళ్లింది. అందువల్ల, బీహార్ అభివృద్ధికి ప్రత్యేక సాయం కోరుతున్నాము. ఆ విషయాలు ఇప్పుడు రోల్ చేయడం ప్రారంభించాయి. ” అని వ్యాఖ్యానించారు.
బీహార్ కోసం పథకాలు
పాట్నా-పూర్నియా ఎక్స్‌ప్రెస్‌వే, బక్సర్-భాగల్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌వే, బక్సర్‌లోని గంగపై రెండు లేన్ల వంతెనతో సహా రూ. 26,000 కోట్ల విలువైన రోడ్డు కనెక్టివిటీ ప్రాజెక్టులు బీహార్‌కు సంబంధించిన ప్రధాన పథకాలు. 21,400 కోట్ల అంచనా వ్యయంతో భాగల్‌పూర్ జిల్లాలోని పిర్‌పైంటిలో 2400 మెగావాట్ల పవర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నారు. యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్ కింద బీహార్‌కు రూ.11,500 కోట్ల వరద సాయం కూడా అందనుంది. ఇది కోసి-మెచి ఇంట్రా-స్టేట్ లింక్ వంటి ప్రాజెక్టులకు ఖర్చు చేస్తారు.
పూర్వోదయ పథకం కింద, అమృత్‌సర్-కోల్‌కతా పారిశ్రామిక కారిడార్‌లోని గయా వద్ద పారిశ్రామిక నోడ్ అభివృద్ధికి కేంద్రం సాయం అందిస్తుంది. విష్ణుపద్ టెంపుల్ కారిడార్, మహాబోధి టెంపుల్ కారిడార్, నలందలను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేసేందుకు సమగ్ర అభివృద్ధికి కూడా ఇది తోడ్పాటును ఇస్తుంది. హిందువులు, బౌద్ధులు, జైనులకు ముఖ్యమైన రాజ్‌గీర్‌ను కూడా అభివృద్ధి చేస్తామన్నారు.
అదనపు కేటాయింపుల ద్వారా మూలధన పెట్టుబడులతో పాటు కొత్త విమానాశ్రయాలు, వైద్య కళాశాలలు, క్రీడా మౌలిక సదుపాయాల నిర్మాణం కూడా ప్రత్యేక పథకాలలో ఉన్నాయి.
ప్రత్యేక హోదా ఎందుకు కోరారు..
2010లో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) భాగస్వామ్య పక్షంగా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన తర్వాత నితీష్ బీహార్‌కు ప్రత్యేక కేటగిరీ హోదాను డిమాండ్ చేయడం ప్రారంభించారు.  ఆ ఎన్నికల్లో జనతాదళ్ (యునైటెడ్) 115 సీట్లు గెలుచుకోగా, దాని మిత్రపక్షమైన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) బీహార్‌లోని 243 సీట్లలో 91 సీట్లు గెలుచుకుంది.
అప్పటి నుంచి, సీఎం నితీష్ జాతీయ అభివృద్ధి మండలి (NDC) సమావేశాలతో సహా ప్రతి వేదికపై ప్రత్యేక డిమాండ్‌ను లేవనెత్తారు. ప్రధానమంత్రికి లేఖలు, సంబంధిత అధికారులకు మెమోరాండాలను పంపారు.
నితీష్ 2012 నవంబర్ లో ఇదే అంశంపై రాజధాని పాట్నాలో ర్యాలీని నిర్వహించారు. అక్కడ మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని అప్పటి యుపిఎ ప్రభుత్వం బీహార్‌కు ప్రత్యేక కేటగిరీ హోదాను నిరాకరించడం ద్వారా వివక్ష చూపిందని, డిమాండ్ నెరవేరే వరకు పోరాడతామని ప్రకటించారు.
మార్చి 2013లో, ఢిల్లీలోని రాంలీలా గ్రౌండ్ ర్యాలీలో, 2014 లోక్‌సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తన మద్దతు కీలకమని, బీహార్‌కు ప్రత్యేక కేటగిరీ హోదా కల్పించే పార్టీలకు మాత్రమే తాను మద్దతిస్తానని నితీష్ పేర్కొన్నారు.
డిమాండ్‌ను ఎందుకు తిరస్కరించారు
బీహార్ త్వరితగతిన అభివృద్ధి చెందేందుకు ప్రత్యేక హోదా కల్పించాలని పదే పదే చేసిన విజ్ఞప్తిని అప్పటి యూపీఏ ప్రభుత్వం తిరస్కరించింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ప్రత్యేక హోదా కల్పిస్తామని హామీ ఇచ్చిన ఆ పార్టీకి మాత్రమే ఓటు వేయాలని నితీశ్ ప్రజలను ఉద్బోధించారు.
నితీష్ కుమార్ పదే పదే డిమాండ్ చేయడంతో, దాని వాస్తవికతను పరిశీలించడానికి కేంద్రం ఇంటర్ మినిస్టీరియల్ గ్రూప్ (IMG)ని ఏర్పాటు చేసింది. IMG తన వాదనలను సమర్పించాలని బీహార్ ప్రభుత్వాన్ని కోరింది. IMG తన నివేదికలో, బీహార్ ప్రధానంగా గిరిజన జనాభా లేదని, తక్కువ జనాభా సాంద్రత కలిగిన కొండ ప్రాంతాలు ఉన్న రాష్ట్రం అనే ప్రమాణాలు బిహార్ కు వర్తించవని ప్రత్యేక హోదాను తిరస్కరించింది.
నేపాల్ నుంచి ప్రవహించే నదుల వల్ల సంభవించే వరదల వల్ల బీహార్ నాశనమవుతుందని నితీష్ వాదించారు. అంతేకాకుండా తలసరి ఆదాయం, విద్యుత్ వినియోగం, మౌలిక వసతుల లేమి, ఆరోగ్య సూచీల్లో రాష్ట్రం వెనుకబడి ఉందని వాదించారు.
అధిరోహణ? ఆరోహణ
కానీ బీహార్‌కు ప్రత్యేక స్కీమ్‌ల ప్యాకేజీకి ఆయన అంగీకరించడం, బీహార్‌కు ప్రత్యేక కేటగిరీ హోదా కల్పించే అంశంపై ఇటీవలి కాలం వరకు అనుసరించిన అతని దూకుడు వైఖరి నుంచి పక్కకు తప్పుకున్నట్లగానే పరిగణించబడుతుంది. వచ్చే ఐదేళ్లలో "ఆర్థిక సాయ ప్రవాహం" కొనసాగకపోతే తిరిగి ప్రత్యేక హోదా డిమాండ్ ను పైకి తీసుకురావచ్చు.
“కేంద్రం నుంచి ఇది మంచి ప్రారంభం. బీహార్ తన వృద్ధి పథాన్ని వేగవంతం చేయడానికి వివిధ రంగాలలో అవసరమైన ఆర్థిక సాయాన్ని పొందడం కొనసాగిస్తుందని మేము ఆశిస్తున్నాము. బీహార్ వంటి వెనుకబడిన రాష్ట్రాలను అభివృద్ధి చేసే భారాన్ని పంచుకోవాల్సిన ఎన్డీయే ప్రభుత్వంలో మేం భాగమయ్యాం’’ అని ముఖ్యమంత్రి అన్నారు.
RJD పాత్ర మార్పు..
హాస్యాస్పదంగా, 2012లో బీహార్ ప్రత్యేక హోదా డిమాండ్‌ను తిరస్కరించిన యుపిఎ ప్రభుత్వంలో భాగమైన రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జెడి) ఇప్పుడు ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తోంది. బీజేపీ నాయకత్వం ఒత్తిడికి తలొగ్గిన నితీశ్‌ ప్రత్యేక హోదాను విడిచిపెట్టారని, మంగళవారం ఆర్జేడీ శాసన సభ్యులు సభా కార్యకలాపాలను స్తంభింప చేశారు.
బీహార్ జలవనరుల శాఖ మంత్రి విజయ్ కుమార్ చౌదరి, రాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడుతూ.. రాష్ట్రానికి ఎన్నడూ లేని విధంగా అత్యున్నత సాయాన్ని అందించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి సభ కృతజ్ఞతలు తెలియజేయాలని అన్నారు.
ఇది నితీష్‌కి అధిరోహణగా భావించవచ్చు, కానీ అతను తెలివిగల రాజకీయ నాయకుడు, సాయం ఆగిపోతే అతను NDAకి కట్టుబడి ఉండడు. 2025 అసెంబ్లీ ఎన్నికలు ఆయన రాజకీయ మనుగడకు కీలకం కానున్నాయి, బీహార్ ముఖ్యమంత్రిగా గెలిచి కొనసాగేందుకు ఆయన ఏ స్థాయికైనా వెళ్లవచ్చు.
Tags:    

Similar News