లక్నో: రహస్యంగా సమావేశమైన బీజేపీ బ్రాహ్మణ ఎమ్మెల్యేలు

రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసిన విందు సమావేశం

Update: 2025-12-24 11:14 GMT
రహస్యంగా సమావేశమైన బీజేపీ బ్రాహ్మణ ఎమ్మెల్యేలు

శిల్పిసేన్

ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాల మధ్య బ్రాహ్మణ ఎమ్మెల్యేలు విందు రాజకీయం సంచలనం సృష్టించింది. నిన్న సాయంత్రం దాదాపు 30 మంది బీజేపీ బ్రాహ్మణ శాసనసభ్యులు లక్నోలోని ఒకే వేదిక వద్ద సమావేశం అయ్యారు.
విందు సమావేశాన్ని రాజకీయ వర్గాలలో బ్రాహ్మణ రాజకీయాల దృక్ఫథంతో చూస్తున్నారు. ఈ సమావేశం రహస్యంగా జరగడంతో బ్రాహ్మణ ఐక్యతకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అంచనాలు వస్తున్నాయి.
బ్రాహ్మణ ఎమ్మెల్యేల..
బీజేపీ కుషినగర్ ఎమ్మెల్యే పిఎన్ పాఠక్ అధికారిక లక్నో నివాసంలో జరిగిన ఈ సమావేశానికి అసెంబ్లీ, శాసనమండలి సభ్యులు హాజరయ్యారు. మంగళవారం ఉపవాసం ఉండటంతో ఈ సమావేశంలో బాతి- చోఖా విందు ఏర్పాటు చేయగా, పండ్లు కూడా వడ్డించినట్లు తెలుస్తోంది. అయితే విందు సమావేశం బ్రాహ్మణ సమాజం ప్రస్తుత స్థితిపై బహిరంగ చర్చకు దారితీసింది.
ఈ సమావేశానికి హాజరైన వారిలో రత్నాకర్ మిశ్రా, ఉమేశ్ ద్వివేదీ, ప్రకాశ్ ద్వివేదీ, రమేష్ మిశ్రా, శలభ్ మణి త్రిపాఠి, విపుల్ దూబే, రాకేశ్ గోస్వామి, రవి శర్మ, వినోద్ చతుర్వేదీ వివేకానంద్ పాండే, అంకుర్ రాజ్ తివారీ, వినయ్ ద్వివేదీ, కైలాశ్ నాథ్ తివారీ, గ్యాన్ శుక్లా ఉన్నారు. మాజీ ప్రిన్నిపల్ సెక్రటరీ నృపేంద్ర మిశ్రా కుమారుడు, ఎమ్మెల్సీ సాకేత్ మిశ్రా కూడా హాజరయ్యారు.
ఈ సమావేశాన్ని సమాజ విందుగా అభివర్ణించినప్పటికీ, రాజకీయ విశ్లేషకులు దీనిని కుల ఆధారిత అధికార ప్రక్రియగా చూస్తున్నారు. ప్రతిపక్ష పార్టీల శాసనసభ్యులు ఈ విందుకు హజరయ్యారని వార్తలు వస్తున్నాయి.
చర్చల గురించి అడిగినప్పుడూ పూర్వాంచల్ కు చెందిన ఒక ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితులు, సాధారణ సమస్యల చుట్టూ తిరుగుతున్నాయని, కానీ రాజకీయ పరిణామాలు, బ్రాహ్మణ సమాజ పరిస్థితి కూడా చర్చకు వచ్చినట్లు తెలిసింది.
ఇతర కులాలపై రాజకీయ దృష్టి ముఖ్యంగా ఓబీసీ వర్గాలపై బీజేపీ ప్రాధాన్యత ఇవ్వడం కూడా చర్చకు వచ్చిందని చెబుతున్నారు. 2027 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ ఓబీసీ, దళిత వర్గాలపై తన దృష్టిని పెంచిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అదే సమయంలో పార్టీ లోపల ఉన్నత కులాలు, బ్రాహ్మణులు, క్షత్రియుల మధ్య పోటీ తలెత్తుతున్నట్లు కనిపిస్తోంది.
ప్రతిపక్షాలు కులరాజకీయాలు..
అంతకుముందు అసెంబ్లీ వర్షాకాల సమావేశాల సందర్భంగా క్షత్రియ శాసనసభ్యులు ఒక హోటల్ లో విందు సమావేశం నిర్వహించారు. ఇది విస్తృతంగా అందరి దృష్టిని ఆకర్షించింది.
బలప్రదర్శనగా క్షత్రియ రాజకీయాలలో ముడిపడి ఉంది. ఇప్పుడు శీతాకాల సమావేశాల సందర్భంగా బ్రాహ్మణ ఎమ్మెల్యేల విందు మరోసారి రాష్ట్రంలో రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించింది.
ఈ విందు సమావేశం రాజకీయ చర్చను మరింత తీవ్రతరం చేసింది. ప్రతిపక్షాలు దీనిని అధికార పార్టీలోని అంతర్గత విభేదాలకు సంకేతంగా చూపించే అవకాశం ఉంది. సమాజ్ వాదీ పార్టీ ఇప్పటికే బీజేపీ కుల ఆధారిత రాజకీయాలను ఆచరిస్తున్నట్లు ఆరోపించింది. ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఈ రోజుతో ముగుస్తాయి. అయితే విందు సమావేశం రాష్ట్రంలో కొత్త చర్చకు దారితీసింది.
Tags:    

Similar News