ఆకస్మాత్తుగా నెట్టుకోవడంతోనే తొక్కిసలాట.. ప్రత్యక్ష సాక్షి
సంఘటన జరిగిన కొద్దిసేపటికే స్వయంగా వచ్చిన యూపీ సీఎం;
By : The Federal
Update: 2025-01-29 13:50 GMT
ప్రయాగ్ రాజ్ లోని మహాకుంభమేళాలో భక్తుల మధ్య ఎలాంటి ఖాళీ లేకపోవడంతో మెల్లగా తోపులాటకు దారితీసిందని, తరువాత అదే అకస్మాత్తుగా తొక్కిసలాటకు కారణమైందని, ఈ దుర్ఘటనలో దాదాపు 12 మంది మరణించి ఉంటారని కర్ణాటకకు చెందిన ప్రత్యక్ష సాక్షి, ప్రఖ్యాత జ్యోతిష్కుడు ఒకరు చెప్పారు.( ఇంతకుముందు ప్రభుత్వ మృతుల సంఖ్యను 30 గా నిర్ధారించింది)
ఆస్ట్రాలజీ అయిన భాను ప్రకాశ్ శర్మ ప్రకారం.. త్రివేణీ సంగమం దగ్గర తెల్లవారుజామున మూడు గంటల సమయంలో తొక్కిసలాట జరిగింది. అనుకున్న సమయానికే అమృత స్నానం చేయడాలనే ఉద్దేశంతో ఒక్క స్నానఘాట్ దగ్గర దాదాపు 50 నుంచి 60 లక్షల మంది ప్రజలు గుమిగూడారని చెప్పారు. పవిత్రస్నానాల కోసం లక్షలాది మంది క్యూలైన్ లో వేచిఉండటంతో తోపులాట ప్రారంభమైందన్నారు.
‘‘మొదట్లో అందరూ శాంతియుతంగా పవిత్రస్నానం చేస్తున్నారు, అకస్మాత్తుగా భక్తుల మధ్య తోపులాట ప్రారంభమైంది. ఇది తొక్కిసలాటకు దారితీసింది’’ అని శ్రీరంగపట్నం నివాసి అయిన శర్మ చెప్పారు.
మరణాలు.. గాయాలు..
ఎవరూ చనిపోవడం తాను చూడలేదని శర్మ చెప్పారు. అయితే అధికారులు, రక్షకులు డజనుమంది భక్తులు మరణించినట్లు చెప్పారని, కొంతమంది గాయపడినట్లు సమాచారం ఇచ్చారన్నారు. మరో 10 మందికి పైగా గాయపడ్డారు. వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఇందులో దాదాపుగా 60 మందికి స్పల్పగాయాలయ్యాయి. క్షతగాత్రులను అంబులెన్స్ లో తరలించారని, ఆ సమయానిక యూపీ సీఎం యోగీ సంఘటన స్థలానికి వచ్చారని అన్నారు.
మౌనీ అమావాస్య..
శర్మ ప్రకారం.. కుంభమేళాలో మొత్తం 60 స్నానఘట్టాలు, 13 అఖాడాలు ఉన్నాయి. ‘‘మౌనీ అమావాస్య నాడు సప్తబుషులు ఈ అఖాడాలలో బ్రహ్మీ ముహూర్తంలో పవిత్ర స్నానం ఆచరిస్తారని నమ్ముతారు. అందువల్ల నాగ సాధువులు పవిత్ర స్నానం ఆచరించిన తరువాత ప్రజలకు స్నానం చేసే అవకాశం లభిస్తుందని అన్నారు. నాగ సాధువులు అమృత స్నానం ముగించే సమయంలో తొక్కిసలాట జరిగిందని ఆయన చెప్పారు.
స్నానఘాట్ ల మూసివేత..
దుర్ఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం రంగంలోకి దిగి స్నాన ఘట్టాలను మూడు గంటల పాటు మూసివేసింది. పరిస్థితి తిరిగి అదుపులోకి వచ్చిన తరువాత అమృత స్నానాలకు పున: ప్రారంభించారని దీనితో యాత్రికులు తిరిగి ఘాట్లకు చేరుకున్నారన్నారు.
ప్రస్తుతం భక్తులు ఆశేషంగా రావడంతో ఫిబ్రవరి 5 న జరిగే వసంత పంచమి వేడుకల తరువాత రావాలని శర్మ సూచించారు. బెంగళూర్ లోని మల్లేశ్వరం నుంచి ప్రకాశ్ అయ్యాంగార్ నేతృత్వంలోని 15 మంది వ్యక్తుల బృందం మహాకుంభాన్ని సందర్శిస్తున్నట్లు ఆయన చెప్పారు. మహాకుంభమేళాకు కర్ణాటక నుంచి దాదాపు 2 లక్షల మంది ప్రజలు హాజరైనట్లు ఓ అంచనా ఉంది.