బాబర్ రోడ్డు పేరు మార్చిన హిందూ సంస్థ.. కొత్తపేరు ఏంటంటే?

దేశ రాజధాని, ఢిల్లీలోని ఓ రోడ్ కు బాబర్ పేరు ఎప్పటి నుంచో ఉంది. తాజాగా దాని పేరు పై ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ స్టిక్కర్ వేసి కొత్త పేరు పెట్టింది.

Update: 2024-01-20 11:23 GMT
బాబర్ రోడ్ అని పేరు ఉన్న బోర్డు పై ఉన్న అయోధ్య మార్గ్ అని అంటించిన స్టిక్కర్

ఢిల్లీలోని బాబర్ రోడ్డు పేరు మార్చాలని చాలాకాలంగా డిమాండ్ చేస్తున్న హిందూ సేన, ప్రభుత్వాలు స్పందించకపోవడంతో కొత్త పేరుతో స్కిక్కర్లు అంటించింది. ఇక నుంచి ఈ రోడ్ పేరు అయోధ్య మార్గ్ గా మారుస్తున్నట్లు తెలిపింది.

ఈ మేరకు అయోధ్య మార్గ్ గా మార్చిన బోర్డును సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ చేసింది. ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థగా పేరు పొందిన హిందూ సేన, దేశ రాజధానిలో చాలా కాలంగా ఉన్న మొగల్ సుల్తాన్ ల పేర్లతో పాటు, బ్రిటిష్ కాలంలో పెట్టిన పేర్లను మార్చాలని డిమాండ్ చేస్తోంది. అయితే న్యూఢిల్లీ మునిసిపల్ కమిటీ కానీ ఇతర ప్రభుత్వ సంస్థలు పట్టించుకోవడం లేదని ఆ సంస్థ ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఇంతకుముందే అంటే 2022 నుంచే ఈ సంస్థ పేర్ల మార్పు డిమాండ్ ను ముందుకు తెచ్చింది. సోమవారం శ్రీ రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం జరగుతుండగా, ఈ సమయంలో హిందూ సేన బాబర్ పేరు మార్చి, దానిని సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ చేసింది. ఈ వీడియోలను జాతీయ మీడియా సంస్థలు ప్రసారం చేశాయి.

"మేము చాలాకాలంగా దండయాత్రికుడు బాబర్ పేరు తీసివేసి దేశం కోసం పాటుపడిన మరొక గొప్ప వ్యక్తిపేరును పెట్టాలని ప్రభుత్వాలను కోరాం. అయినా ఎవరూ పట్టించుకోవడం లేదు. అయోధ్యలోనే బాబ్రీ మసీదు లేదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పినప్పడు, ఇక ఢిల్లీలో బాబర్ పేరు ఎందుకు " అని హిందూసేన అధ్యక్షుడు విష్ణుగుప్తా అన్నట్లు జాతీయ మీడియా వార్తలు ప్రసారం చేసింది.

" ఈ రోడ్డును చూసిన ప్రతిసారీ మనం ఇంకా మొగల్ పాలనలో ఉన్నామా అనే సందేహం వచ్చింది. అందుకే రామమందిరంలో ప్రాణ ప్రతిష్ట సందర్భంగా బాబర్ పేరును తొలగించి అయోధ్య మార్గ్ గా మార్చాం" అని విష్ణుగుప్తా చెప్పినట్లు సమాచారం.

ఇంతకుముందు మారిన పేర్లు

కేంద్ర ప్రభుత్వం ఇంతకుముందు దేశంలోని పలు రోడ్ల పేరును మార్చింది. సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ పూర్తయిన తరువాత 2022 లో రిపబ్లిక్ పరేడ్ జరిగే రోడ్డు పేరును రాజ్ పథ్ నుంచి కర్తవ్యపథ్ గా మార్చింది.

అంతకుముందు అంటే 2015లో ఢిల్లీలోని ఓ రోడ్ మొగల్ సుల్తాన్ లోనే మత దురంహకారీ గా పేరుపడ్డ ఔరంగజేబు పేరును తొలగించి, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం రోడ్ గా మార్చింది. అదేవిధంగా 2016లో రేస్ కోర్స్ రోడ్ ను లోక్ కల్యాణ్ మార్గ్ గా మార్చింది. అంతే కాకుండా ఒడిషాలోని భారత మిస్సైల్ ప్రయోగాలు చేసే దీవికి బ్రిటిష్ అధికారి పేరు పై వీలర్ ఐలాండ్ గా పిలుస్తుండేవారు. తరువాత ఏపీజే అబ్డుల్ కలాం పేరును పెట్టారు.

భారత నేవీలోని బ్రిటిష్ కాలం నాటి గుర్తును తొలగించి, ఛత్రపతి శివాజీ కాలం నాటి ముద్రను చేర్చారు. అండమాన్ దీవుల లోని కొన్నింటిని పేర్లను సైతం మార్చింది.

బాబర్ పేరు మార్చిన వీడియోను సామాజిక మాధ్యమం ఎక్స్ లో విష్ణుగుప్తా పోస్ట్ చేశారు. అయితే తరువాత అధికారులు ఈ స్టిక్కర్ ను తొలగించారు. 

Tags:    

Similar News