రెండొందల మందిని క్వారంటైన్ చేసిన జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం
రాజోల్ లో 17 మంది మరణించడంతో కీలక నిర్ణయం, మెడికల్ సిబ్బంది, వైద్యుల సెలవులు రద్దు;
By : The Federal
Update: 2025-01-25 09:46 GMT
జమ్మూకాశ్మీర్ లోని రాజౌరీల గత కొన్ని రోజులుగా అనుమానాస్పదరీతిలో 17 మంది మరణించడంతో ప్రభుత్వం వైద్యులు, పారామెడికల్ సిబ్బంది సెలవులను రద్దు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాంతంలోని దాదాపు 230 మందిని క్వారైంటైన్ చేశారు.
దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ మాట్లాడుతూ... ప్రాథమిక విచారణ చేస్తున్నారు. కొన్ని శాంపిల్ లను లక్నోలోని టాక్సీకాలజీ ల్యాబ్ లో పరిశీలించినట్లు వివరించారు. ఇందులో ఎటువంటి ఇన్ ఫెక్షన్ కానీ, వైరస్, బ్యాక్టీరియా ఆనవాళ్లను కనుగొనలేదు. కానీ కొన్ని విష ఆనవాళ్లు ఉన్నాయని మాత్రం చెబుతున్నారు.
రాజోరిలోని గవర్నమెంట్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ అమర్ జీత్ బాటియా మీడియాతో మాట్లాడుతూ.. రాజౌరీ లోని అందరూ డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది సెలవులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే శీతకాల సెలవులను రద్దు చేస్తూ కూడా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
ఈ ప్రాంతంలో ప్రజలు అనుమానాస్పదంగా మృతి చెందిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం కూడా అదనంగా మరో 10 మంది మెడికల్ విద్యార్థులను అక్కడకు పంపింది. ఆస్పత్రుల్లో మెడికల్ సెటప్ చేయడానికి వీరిని పంపినట్లు తెలిపారు.
మరో ముగ్గురు బాధితులకు రాజౌరీలోని జీఎంసీ ఆస్పత్రిలో అలాగే చండీగఢ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నలుగురు వ్యక్తులు అందులో ముగ్గురు ఆడవారిని అత్యవసరంగా ఎయిర్ లిప్ట్ చేసి జమ్మూకి పంపారు. మరోకరికి రాజోరిలోనే చికిత్స చేస్తున్నారు. బాధిత కుటుంబంతో సంబంధం ఉన్న మరికొంతమంది కుటుంబాలను అధికారులు శుక్రవారం క్వారైంటైన్ లోకి పంపారు.
వీరితో పాటు చాలామంది చుట్టుపక్కల వారిని కూడా అధికారులు నిర్భంధంలోకి పంపడంతో వీరి సంఖ్య 230కి చేరినట్లు జమ్మూ అధికారులు తెలిపారు. ప్రస్తుతం వీరిని రాజౌరీలోని నర్సింగ్ కాలేజీలో ఉన్నారు. ప్రస్తుతం ఉన్న విష పదార్థాలకు విరుగుడు కనుగొంటున్నామని లక్నో టాక్సిక్ కార్యాలయం పేర్కొంది.
చనిపోయిన 17 మందిలో 13 మంది చిన్నారులు ఉండటం అందరిని కలిచివేస్తోంది. బాదల్ గ్రామంలో దాదాపుగా నెల రోజుల క్రితం అంతుచిక్కని కారణాలతో వీరంతా అసువులు బాశారు. వీరి మరణంపై పోలీసులు ప్రత్యేకంగా విచారణ చేస్తున్నారు. ఇవన్నీ కేవలం మూడు కుటుంబాల్లోనే జరగడం ఎవరికి అంతుబట్టడం లేదు.
ఈ మరణాలపై ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం నియమించింది. మృతుల శరీరా భాగాల్లో విషం ఆనవాళ్లు ఉండటంతో దాదాపు 50 మందిని పోలీసులు విచారించారు. కానీ ఎటువంటి సమాధానాలు రాబట్టలేకపోయారు.