సనాతన బోర్డు స్థాపనకు పిలుపు
మహా కుంభమేళాలో మఠాల పీఠాధిపతుల డిమాండ్..;
ఉత్తరప్రదేశ్(Utter Pradesh) మహా కుంభమేళా(Kumbh Mela) లో నిర్వహించిన సనాతన ధర్మసంసద్(Dharm Sansad)కు వివిధ మఠాల మఠాధిపతులు(Seers) సమావేశమయ్యారు. సనాతన బోర్డు స్థాపనకు పిలుపునిచ్చారు. ప్రార్థనా స్థలాల (ప్రత్యేక నిబంధనలు) చట్టాన్ని రద్దు చేయాలని జగద్గురు విద్యాభాస్కర్ జీ మహారాజ్ ప్రధాని మోదీ(PM Modi)కి విజ్ఞప్తి చేశారు. హిందూ దేవాలయాలను కూల్చి నిర్మించిన మసీదుల రక్షణకు తెచ్చిన చట్టాన్ని నిలిపేయాలని, గతంలో ఎలాంటి చర్చ లేకుండానే ఈ చట్టాన్ని తెచ్చారని ఆయన పేర్కొన్నారు.
సనాతన ధర్మసంసద్‌కు అధ్యక్షత వహించిన నింబార్క పీఠాధీశ్వర శ్యామ్ శరణ్ దేవాచార్య మాట్లాడుతూ సనాతన బోర్డు సనాతన ధర్మాన్ని కాపాడటమే కాక భవిష్యత్ తరాల భద్రతకు భరోసానిస్తుందన్నారు.
"తిరుమల(Tirumala)లాగా అన్యమతస్తుల ప్రవేశాన్ని అరికట్టి హిందూ విశ్వాసాన్ని కాపాడేందుకు ఈ బోర్డు అవసరం. ఇకనైనా చర్యలు తీసుకోకపోతే.. భారతదేశం హిందువుల చేతులు దాటిపోయే ప్రమాదం ఉంది" అని దేవాచార్య పేర్కొన్నారు.
'సనాతనుల' కోసం సంస్థ అవసరాన్ని ఇస్కాన్ నేత గౌరాంగ్ దాస్ జీ మహారాజ్ వివరించారు. "CII, FICCI వంటి సంస్థలు పరిశ్రమల కోసం, IMA వైద్యం కోసం ఉన్నప్పుడు, సనాతనుల సంరక్షణ కోసం ఎందుకు ఉండకూడదు?" అని ప్రశ్నించారు. శాంతి, భద్రత, న్యాయం కోసం అన్ని 'సనాతనులు' ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు.
వక్ఫ్ బోర్డు ద్వారా దేశాన్ని కబ్జా చేసే కుట్ర జరుగుతోందన్న ప్రచారకుడు దేవకీనందన్ ఠాకూర్ ఆరోపించారు. "పాకిస్థాన్ వెళ్లిపోయినవారి భూములు వక్ఫ్ బోర్డు ఆధీనంలో ఉన్నాయి. అక్కడి నుంచి భారతదేశానికి వచ్చిన హిందువుల భూములకు పాకిస్థాన్‌లో హిందూ బోర్డు ఎందుకు లేదు?" అని ఆయన ప్రశ్నించారు.
"తిరుపతి బాలాజీ లాంటి దేవాలయాలు ఏటా రూ. 500 కోట్లు ప్రభుత్వానికి అందిస్తున్నాయి. ఈ నిధులు సనాతన ధర్మ కోసం ఉపయోగించాలి. సనాతన బోర్డు ఏర్పడితే..ప్రతి దేవాలయానికి గోశాల, గురుకులం, ఆసుపత్రి ఉండేలా చేస్తాం," అని పేర్కొన్నారు.
ధర్మసంసద్‌లో హరిద్వార్‌కు చెందిన చిన్మయానంద బాపు, మహామండలేశ్వర్ అశుతోష్ నంద్ మహారాజ్, రాఘవాచార్య జీ మహారాజ్, జైన సంత్ వివేక్ ముని జీ మహారాజ్, హనుమాన్ గరిహి మహంత్ రాజు దాస్, అయోధ్యకు చెందిన వల్లభాచార్య జీ మహారాజ్ పాల్గొన్నారు. వీరంతా సనాతన బోర్డు స్థాపనకు మద్దతు ప్రకటించారు.