ఎస్‌బిఐ ఎటిఎం కార్డుదారులకు షాక్‌

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకు ఏటీఎం వినియోగ దారులకు షాక్ ఇవ్వనుంది. ఈ షాక్ నూతన ఆర్థిక సంవత్సరమైన 2024 ఏప్రిల్ ఒకటి నుంచి అమలులోకి వస్తుంది.

Update: 2024-03-29 09:55 GMT
స్టేట్ బ్యాంక్

భారతదేశంలో ఉన్న బ్యాంకుల్లోకి అతి పెద్దప్రభుత్వ బ్యాంక్‌ అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు చెందిన కోట్లాది మంది ఖాతాదార్లకు పెద్దషాక్‌ ఇవ్వబోతోంది ఈ ప్రభుత్వ బ్యాంక్, వివిధ డెబిట్‌ కార్డుల (ఏటీఎం) వార్షిక నిర్వహణ చార్జీలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్‌ 1 నుంచి ఈ చార్జీలు అమలులోకి రానున్నాయి.

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్నసమాచారం ప్రకారం, వివిధ డెబిట్‌ కార్డుల వార్షిక నిర్వహణ చార్జీఅలను రూ. 75 వరకు బ్యాంక్‌ పెంచబోతోంది. డెబిట్కార్డ్‌ల కొత్తవార్షిక నిర్వహణ చార్జీలు 2024 ఏప్రిల్‌ 1 నుంచి (కొత్త ఆర్థికసంవత్సరం) నుంచి అమలులోకి వస్తాయి. దేవంలో కోట్ల మంది ప్రజలు ఎస్‌బిఐ డెబిట్‌ కార్డుల ఉపయోగిస్తున్నారు. కష్టమర్ల సంఖ్య పరంగా కూడా ఎస్‌బిఐ దేశంలో పెద్ద బ్యాంకు.

Delete Edit

చార్జీల బాదుడు ఇలా..

క్లాసిక్, సిల్వర్, గ్లోబల్, కాంటాక్ట్‌ లెస్‌ డెబిట్‌ కార్డ్‌ 2024 ఏప్రిల్‌ 1 నుంచి యూజర్‌ చార్జీల రూపంలో వసూలు చేసేందుకు నిర్ణయించింది. రూ. 200 + జిఎస్టీ చెల్లించాలి. ప్రస్తుతం ఈ చార్జీలు రూ. 125 + జిఎస్టీగా ఉంది.
యువ, గోల్డ్, కాంబో డెబిట్‌ కార్డ్, మైకార్డ్‌ (ఇమేజ్‌ కార్డ్‌) యూజర్ల నుంచి ప్రస్తుతం ఉన్న రూ. 175 + జిఎస్టీకి బదులుగా రూ. 250 + జిఎస్టీ బ్యాంక్‌ వసూలు చేస్తుంది.
ప్లాటీనం డెబిట్‌ కార్డు వినియోగ దారుల నుంచి ప్రస్తుతం ఉన్న రూ. 250 + జిఎస్టీ బదులుగా రూ. 325 + జిఎస్‌టీ వసూలు చేస్తుంది.
ప్రైడ్, ప్రీమియం బిజినెస్‌ డెబిట్‌ కార్డుల వార్షిక నిర్వహణ చార్జీలు రూ. 350 + జీఎస్టీ నుంచి రూ. 425 + జీఎస్టీకి పెరుగుతుంది.
కొత్త ఏటిఎం కార్డు ఇచ్చేందుకు కూడా చార్జీలు కొత్తగా తీసుకొచ్చారు. గోల్డ్‌ కార్డుకు రూ. 100లు ప్లస్‌ జీఎస్టీ, ప్లాటీనం కార్డుకు రూ. 300 ప్లస్‌ జీఎస్టీ తీసుకొచ్చారు. ఏటీఎంలో బ్యాలెన్స్‌ ఎంక్వయిరీ చేస్తే రూ. 25లు ప్లస్‌ జీఎస్టీ కట్‌ చేస్తారు.
డూప్లికేట్‌ పిన్, రిజిస్ట్రేషన్‌ పిన్‌ జనరేషన్‌ కు రూ. 50లు ప్లస్‌ జీఎస్టీ ఉంటుంది. డెబిట్‌ కార్డ్‌ రీప్లేస్‌మెంట్‌ చార్జీలు రూ. 300లు ప్లస్‌ జీఎస్టీ ఉంటుంది. ఇప్పటి వరకు ఈ చార్జీలు లేవు. ఏప్రిల్‌ ఒకటి నుంచి ఈ చార్జీలన్నీ అమలులోకి వస్తాయి.
Tags:    

Similar News