Tirumala | సప్తగిరులపై ఏడు అడుగుల మహిళ..

తిరుమలలో ప్రత్యేక ఆకర్షణగా శ్రీలంక మాజీ క్రీడాకారిణి.

Byline :  The Federal
Update: 2025-11-03 14:12 GMT
తిరుమల శ్రీవారి ఆలయం వద్ద శ్రీలంక మాజీ క్రీడాకారిణి తర్జిని శివలింగం

తిరుమల క్షేత్రం అద్భుతాలకు నిలయం. వింతలు విడ్డూరాలకు కొదవ ఉండదు. ప్రపంచంలోనే అనేక ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులు తమ ప్రత్యేకతను చాటుకుంటూ ఉంటారు. ఆ కోవలోనే శ్రీవారి ఆలయ ప్రధాన గోపురం చెంత శ్రీలంకకు ఓ పొడవాటి మహిళ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

ఏడు అడుగుల ఎత్తు ఉన్న ఆ మహిళకు దేవుడిచ్చిన వరం కూడా. శ్రీలంక నెట్ బాల్ క్రీడలో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన తర్జని శివలింగం ( Tarjani Shivalingam ) తిరుమల ( Tirumala ) ఏడుకొండల పై ప్రత్యేక ఆకర్షణగా కనిపించారు.

తిరుమల శ్రీవారి ఆలయం వెలుపల తర్జిని శివలింగం

ఏడుకొండలపై..
శ్రీలంక నెట్ బాల్ మాజీ క్రీడాకారిణి తర్జీని శివలింగం సోమవారం ప్రత్యేక ఆకర్షణగా మారారు. ఏడు అడుగుల పొడవు ఉన్న ఈ శ్రీలంక క్రీడాకారిణి శ్రీవారి దర్శనానికి వచ్చారు. యాత్రికులతో కలిసి క్యూలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలోకి వెళ్లారు. ఆ సమయంలో ఆమె వెంట నడుస్తున్న వారే కాకుండా శ్రీవారి దర్శనానికి వచ్చిన యాత్రికులు కూడా ఆమెనే ప్రత్యేకంగా చూస్తూ ఉండడం కనిపించింది.
అత్యంత ఎత్తైన మహిళగా గుర్తింపు పొందిన తర్జని శివలింగం చూసే వారికి వింతగా కనిపించినప్పటికీ. శ్రీలంక దేశం నుంచి నెట్ బాల్ క్రీడకు ప్రాతినిధ్యం వహించిన తర్జని శివలింగం ప్రపంచంలో గుర్తింపు సాధించారు.
వానమామలై పీఠాధిపతికి పెద్ద మర్యాదతో స్వాగతం..

తిరుమల శ్రీవారి దర్శనానికి వానమామలై పీఠాధిపతి రామానుజ జీయర్ స్వామి తన భక్త బృందంతో సోమవారం తిరుమలకు వచ్చారు. ఆయనకు తిరుమల తిరుపతి దేవస్థానం కార్యానిర్వాహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్, శ్రీవారి ఆలయ అర్చకులు పెద్ద మర్యాదతో స్వాగతించారు. బేడీ ఆంజనేయస్వామి ఆలయం వద్ద వేదమంత్రాలు సెఠారితో ఆశీర్వచనం అందించి శ్రీవారి దర్శనం కోసం ఆలయంలోకి మర్యాదలతో తోడుకుని వెళ్లారు.
వానమామలై పీఠాధిపతి రామానుజ జీయర్ స్వామి తో పాటు భక్తులు అనేకమంది తరలివచ్చారు. వారిలో తమిళనాడు నుంచి వచ్చిన భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంది. వానమామలై పీఠాన్ని శ్రీలంక ( SriLanka ) నెట్ బాల్ ( Netball )  మాజీ క్రీడాకారిణి తర్జుని శివలింగం కూడా దర్శించుకోవడానికి వచ్చారని తెలుస్తోంది.
వానమామలై పీఠాధిపతి రామానుజ జీయర్ స్వామితో పాటు భక్త బృందంతో కలిసి శ్రీలంక మాజీ క్రీడాకారిణి ధర్జిని శివలింగం కూడా తిరుమల కు చేరుకున్నారు. వానమామలై పీఠాధిపతి రామానుజ జీయర్ స్వామి, భక్త బృందం ఆలయ మహద్వారం నుంచి శ్రీవారి దర్శనానికి వెళితే, సాధారణ భక్తులతో కలిసి అత్యంత ఎత్తుతో అందరిని దృష్టిని ఆకర్షించిన.శ్రీలంక నెట్ బాల్ మాజీ క్రీడాకారిణి తర్జని శివలింగం క్యూలో ఆలయంలోకి వెళ్లారు.
శ్రీవారి దర్శనం అనంతరం భక్త బృందంతో కలిసి ఆలయం వెలుపలికి వచ్చిన శ్రీలంక నెట్ బాల్ మాజీ క్రీడాకారిణి తర్జని శివలింగం ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆలయం నుంచి అఖిలాండలం వైపు భక్తులతో కలిసి నడిచి వెళుతున్న ఆమెను చూసేందుకు యాత్రికులకు ప్రత్యేక ఆసక్తి చూపించారు.
Tags:    

Similar News