BIG BREAKING | జేసీబీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు

తిరుపతి సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో 30 మంది గాయపడ్డారు. కొద్దిసేపటి కిందటే ఈ సంఘటన జరిగింది.

Byline :  SSV Bhaskar Rao
Update: 2024-12-17 05:36 GMT

తిరుపతికి సమీపంలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళుతున్న జేసీబీని చిత్తూరు-2 డిపో ఆర్టీసీ బస్సు ఢీకొంది. దీంతో బస్సు ముందుభాగం ధ్వంసమైంది. వేగంగా డీకొనడం వల్ల బస్సులోని చాలా మంది గాయపడినట్లు సమాచారం అందింది. ఈ ఘటనలో దాదాపు 20 నుంచి 30 మంది వరకు తీవ్రంగానే గాయపడినట్లు ప్రాధమిక సమాచారం అందింది.


ఈ సంఘటన నాయుడుపేట- పూత్తలపట్టు రహదారిలోని తిరుపతి రూరల్ గొల్లపల్లి సమీపంలో జరిగింది. ఈ విషయం తెలుసుకున్న తిరుపతి రూరల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సంఘటన ప్రదేశంలో దెబ్బలు తగిలిన బాధితుల రోదనలు సమీపంలోని వారిని కూడా కంటతడి పెట్టించాయి. ఘటన స్థలం నుంచి బాధితులను తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించాడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఈ సంఘటనకు సంబంధించి, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News