విజయవాడలో అద్భుత కళాఖండం

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ఆయువుపట్టుగా చెప్పుకునే విజయవాడ నగరంలో ఓ అద్భుత కళాఖండం ఆవిష్కృతమైంది.నగరంలో కూర్చునేందుకు ఒక మంచి పార్కు లేదనే లోటు తీరిపోయింది.

Update: 2024-01-12 06:36 GMT
డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహం

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ నగరంలో అద్భుత కళాఖండం రూపుదిద్దుకుంది. 18.81 ఎకరాల విస్తీర్ణంలో ఈ కళాఖండం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రపంచంలోనే ఎల్తైన 210 అడుగుల డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహం అద్భుతమైన కళాకారుల చేతుల్లో కళాకృతి పొందింది. విగ్రహం ఎత్తు 125 అడుగులు. కింద బేస్‌ (ఫెడస్టల్‌) ఎత్తు 85 అడుగులు. దీంతో మొత్తం విగ్రహం ఎత్తు 210 అడుగులు. విగ్రహం తయారీకి 400 మెట్రిక్‌ టన్నుల స్టెయిన్‌ లెస్‌ స్టీల్, 120 మెట్రిక్‌ టన్నుల బ్రాంజ్‌ వినియోగించారు.


Delete Edit



విజయవాడలోని స్వరాజ్‌ మైదాన్‌లో రూపు దిద్దుకున్న అంబేద్కర్‌ స్మృతివనం నిర్మాణానికి రూ. 400 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసింది. స్మృతివనానికి వన్నె తేవటానికి 2,200 మెట్రిక్‌ టన్నుల రాజస్థాన్‌ పింక్‌ ఇసుకరాయితో తాపడం జరిగింది. అంబేడ్కర్‌ ఎక్స్‌ పీరియన్స్‌ సెంటర్, కన్వెన్షన్‌ సెంటర్, మినీ థియేటర్, ధ్యానకేంద్రం, ఫుడ్‌ కోర్టు, చిన్నారులు ఆడుకోవటానికి ప్లే ఏరియా, గార్డెన్లు, మ్యూజిక్‌ ఫౌంటేయిన్, వాటర్‌ ఫౌంటేయిన్‌లు ఏర్పాటు చేశారు.

Delete Edit
భవనంలో గోడలకు స్వాతంత్య్ర సమరం, స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఏర్పాట్లు, అప్పటి నేతల ఫొటోలతో కూడిన కళాఖండాలు పలువురిని ఆకర్శిస్తున్నాయి. అన్ని రూములకు సెంట్రల్‌ ఏసీ ఏర్పాటు చేశారు. గార్డెన్‌లు పచ్చని గరిక గడ్డితో పలువురిని ఆకర్శిస్తున్నాయి. అంబేద్కర్‌ విగ్రహం ఎదురుగా కింది భాగంలో గడ్డితో నిర్మించిన నెమళ్ల ఆకృతులు ఆహుతులను కట్టిపడేస్తున్నాయి. అక్కడక్కడా పాలరాయిని వినియోగించారు. రాజస్థాన్‌ పింక్‌ ఇసుకరాయితో కొన్ని కట్టడాలు పింక్‌ కలర్‌లో ఆకర్షిస్తున్నాయి. కాంపౌండ్‌ వాల్‌ చుట్టూ వివిధ రకాల ఆకృతులు ఆకర్షిస్తున్నాయి. కట్టడమంతా లైట్‌ పింక్‌ కలర్‌లో ఉంది. భవనం చుట్టూ వాటర్‌ పౌంటెయిన్‌ ఏర్పాటు చేశారు. మధ్యలో వాటర్‌ చిందిస్తూ చల్లని వాతావరణం అక్కడికి చేరుకోగానే ఏర్పడుతుంది. రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు, పోలీస్‌ అధికారులు ఇప్పటికే సందర్శించి సీఎం ప్రారంభోత్సవ ఏర్పాట్లు పరిశీలించారు.

Delete Edit

ఈనెల 19న ప్రారంభం
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అంబేద్కర్‌ స్మృతి వనాన్ని ఈనెల 19న ప్రారంభించి అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అంబేడ్కర్‌ స్మృతివనం ప్రారంభోత్సవం రాష్ట్ర పండగలా నిర్వహించటానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్లెక్సీలు ఏర్పాటు చేస్తారు. స్మృతివనంలో ఏర్పాటు చేసిన డిజిటల్‌ స్క్రీన్స్‌పై ఆ ప్లెక్సీలు, అక్కడ జరిగే కార్యక్రమాలు ప్రదర్శిస్తారు. ప్రారంభోత్సవానికి వచ్చిన ఆహ్వానితులతో పాటు ప్రజలు జిల్లాల్లో, గ్రామ, వార్డు సచివాలయాల్లో జరిగే కార్యక్రమాలను ఇక్కడ స్క్రీన్స్‌పై చూస్తారు. అలాగే కొన్ని జిల్లాల్లో సమావేశాలు కూడా నిర్వహిస్తారు. ఈ సమావేశాల నిర్వహణ కూడా స్మృతివనంలో ఏర్పాటు చేసిన స్క్రీన్స్‌పై డిస్‌ప్లే అయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకున్నది.

Delete Edit
మహనీయుని జ్ఞాపకార్థం
అంబేద్కర్‌ మహనీయుడు. ఆయన జ్ఞాపకార్థం విజయవాడలో ప్రభుత్వం స్మృతివనం నిర్మించింది. ప్రపంచంలోని అద్భుత కళాఖండాల్లో ఒకటిగా మిగిలిపోయేలా నిర్మాణం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌కు స్మృతివనం తలమానికం. అన్ని రకాల సౌకర్యాలు ఈ స్మృతివనంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇదొక గొప్ప ప్రయోగం. ప్రభుత్వం ఈ ప్రయోగంలో సక్సెస్‌ అయింది.
– వై శ్రీలక్ష్మీ, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
చారిత్రక ఘట్టం
విజయవాడ నడిబొడ్డున 18.81 ఎకరాల విస్తీర్ణంలో రూ. 400 కోట్ల ఖర్చుతో 205 అడుగుల ఎత్తయిన అంబేద్కర్‌ విగ్రహాన్ని ప్రభుత్వం నిర్మించడం చారిత్రక ఘట్టం. ప్రపంచంలోనే ఒక అద్భుతమైన కళాఖండంగా స్మృతివనం నిర్మాణం జరిగింది. చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుంది. విజయవాడకే సెంటర్‌ అఫ్‌ అట్రాక్షన్‌గా నిలిచింది. ప్రపంచంలోనే అద్భుతమైన కళాఖండంగా అంబేద్కర్‌ స్మృతివనం రూపుదిద్దుకుంది.
– మారుమూడి విక్టర్‌ ప్రసాద్, మాజీ చైర్మన్, ఏపీ ఎస్సీ కమిషన్‌.

Delete Edit

Delete Edit

Delete Edit

Tags:    

Similar News