రైతన్నా.. బాగున్నావా, మీ కోసం వచ్చాం!

పల్లెబాట పట్టిన వ్యవసాయాధికారులు, నేటి నుంచి వారం రోజుల పాటు రైతు స్థితిగతులపై సమగ్ర సర్వే

Update: 2025-11-24 03:29 GMT
రైతన్నా.. మీ కోసం
ఈ స్లోగన్ వింటుంటే గతంలో 'ఆకాశవాణి'లో 'ఏం, రామన్నా, దిగాలుగా ఉన్నావ్' అంటూ వచ్చే యాడ్ గుర్తుకువస్తోంది కదూ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడలాంటి పనే మొదలు పెట్టింది. రైతుల కష్టసుఖాలు తెలుసుకుని, రైతుల్ని రాజుల్ని చేసే కసరత్తు మొదలు పెట్టింది. దీని కోసం అధికారులు ఊరూరా వెళ్లి అన్నదాతల్ని వ్యక్తిగతంగా కలుసుకుని 'ఏం రైతన్నా, మీ కోసం' వచ్చామని చెప్పబోతున్నారు. ఇదో వారం రోజుల ప్రోగ్రాం. అది ఎట్లా సాగుద్దంటే..

నవంబర్ 24 నుంచి అంటే సోమవారం నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకూ ‘రైతన్న-మీకోసం’ కార్యక్రమం కింద ఇంటింటి సర్వే నిర్వహించనున్నారు.
రై తుల జీవనోపాధి, ఆర్థికస్థితి, నైపుణ్యాభివృద్ధితో అంచనా వేసి, రైతుల్లో శాశ్వత మార్పు తీసుకు రావడం లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టింది. దీంతో వ్యవసాయ, పశుసంవర్ధక, ఉద్యా న, మత్స్య, అనుబంధ శాఖల అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు.
సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశాల ప్రకారం రైతుల స్థితిగతులపై ఇంటింటా సర్వే చేస్తున్నారు. ప్రతీ ఇంటికి వెళ్లి రైతుతో మాట్లాడడం కోసం ఏడు రోజుల పాటు హౌస్‌ టు హౌస్‌ సర్వే చేయనున్నారు.
నీటిభద్రత, డిమాండ్‌ ఆధారిత వ్యవ సాయం, వ్యవసాయ పద్ధతుల్లో సాంకేతికత, ఆహార ప్రాసెసింగ్‌, ప్రభుత్వ మద్దతు అనే ఐదు సూత్రాల పట్ల రైతులకు అవగాహన కల్పిస్తారు.

ఈనెల 24 నుంచి 29వ తేదీ వరకు రైతుల ఇళ్లకు అధికారుల బృందాలు వెళతాయి. ఈనెల 30 నుంచి డిసెంబర్‌ 2 వరకూ డేటా సేకరించి విశ్లేషిస్తాయి. వచ్చేనెల 3వ తేదీన ఈ డేటా ఆధా రంగా 2026-27 సంవత్సరానికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక ఖరారు చేస్తాయి.
ప్రతీ రైతు సేవా కేంద్రంలోనూ వర్క్ షాప్ నిర్వహించి పరిష్కార మార్గాలను కనిపెడతాయి.
గ్రామస్థాయిలో రైతు సేవా కేంద్రం ద్వారా నిర్వహించే ఈ ప్రచారం లో ఆర్‌ఎస్‌కే సహాయకులు, పశుసంవర్ధక, మత్స్యశాఖ సహాయకులు, గ్రామ రెవెన్యూ అధి కారులు, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు, ఎనర్జీ అసి స్టెంట్లు, ప్రగతిశీల రైతులు, ప్రాథమిక వ్యవసా య కమిటీలు, నీటి వినియోగదారుల సంఘాల ప్రతినిధులు, మార్కెట్‌ కమిటీ సభ్యులు భాగ స్వాములవుతారు
ఈ సర్వే కోసం ప్రతీ మూడు కుటుంబాలను ఒక క్లస్టర్‌గా విభ జించి, ఒక అధికార బృందం రోజుకు 30 క్లస్ట ర్లు అంటే 90 ఇళ్లు సందర్శిస్తారు.
ఒక్కో బృందం మొత్తం 540 కుటుంబాల వివరాలు సేకరిస్తారు.
ఈ సమయంలో సీఎం సందేశ పత్రం, మరో కరపత్రం కూడా రైతులకు అందజేస్తారు. APIMS (ఏపీఏఐఎంఎస్‌) యాప్‌ వినియోగంపై రైతులకు అవగాహన కల్పిస్తారు. ఇంటింటి ప్రచారంలో రైతుల నుంచి సేకరించిన సూచనలు, ఫిర్యాదులను ప్రణాళిక తయారుచేసి డిసెంబర్ 3న ఆర్‌ఎస్‌కే స్థాయిలో వర్కు షాప్‌ నిర్వహించి చర్చిస్తారు. ఆ తర్వాత నివేదికను ప్రభత్వానికి పంపుతారు.
అయితే ఇటువంటి సర్వేల పట్ల పెదవి విరిచే వారూ లేకపోలేదు. రైతుల స్థితిగతులేమిటో ప్రభుత్వాలకు తెలియవా, ఇదో కాలక్షేపం వ్యవహారమని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కార్యదర్శి కెవీవీ ప్రసాద్ అన్నారు. రైతుల ఆర్ధిక పరిస్థితి మెరుగుపడాలంటే వాళ్లు పండించే పంటలకు ముందు గిట్టుబాటు ధర కల్పించాలని, నిరుపేద రైతులకు ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు భూమి పంచాలని ప్రసాద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
Tags:    

Similar News