అమరావతి కలలు నిజమవుతాయి
ఏపీలోని అమరావతి పునర్నిర్మాణ సభలో ప్రధాన మంత్రి మాట్లాడారు.;
అమరావతి పుణ్యభూమి పై ఈరోజు నేను నిలబడి ఉన్నప్పుడు కల నిజమవుతుందనే భావన కనిపిస్తుంది. ఇక్కడ బౌద్ధ వారసత్వానికి సంబంధం ఉంది. రూ. 60వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసుకున్నాం. వికసిత్ భారత్ వైపు వెళుతున్నామని ప్రధాన మత్రి నరేంద్ర మోదీ అన్నారు.
అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులు ప్రారంభించేందుకు వచ్చిన ప్రధాన మంత్రి మోదీ పైలాన్ ను ప్రారంభించి సభలో మాట్లాడారు. వీరలింగేశ్వర, అమరలింగేశ్వర, తిరుపతి వెంకన్న స్వామి పాదాలకు వందనం చేస్తన్నాను. తర్వాత ఆయన చంద్రబాబు మీద, అమరావతి రాజధాని మీద ప్రశంసల వర్షం కురిపించారు.
"మిత్రులారా ఇంద్రుడి తాలూకా రాజధాని తెలుసు. స్వర్ణాంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నిర్మానానికి నాంది పలుకుదాం. అమరావతి ఒక నగరం కాదు. అధునాతన ఆంధ్రప్రదేశ్ గా మర్చే శక్తి అని ప్రధాని మోదీ అన్నారు. అమరావతి అనేది ప్రతి యువకుడి కలలు పండించే కేంద్రం. క్లీన్ ఎనర్జీ గ్రీన్ ఎనర్జీ, అందిస్తుంది. కేంద్రం రికార్డు స్పూర్తితో పనులు చేయడానికి సంపూర్ణ సహకారం అందిస్తుంది. చంద్రబాబు టెక్నాలజీ నాతో మొదలైందని ప్రశంసిస్తున్నారు. కానీ నేను మీకొక రహస్యం చెబుతున్నాను. నేను గుజరాత్ లో ముఖ్యమంత్రిగాఉన్నపుడు హైదరాబాద్ లో చంద్రబాబు నాయుడు చేస్తున్న పనులను చూసి చాలా తెలుసుకున్నాను. ఈరోజు నేను ఆంధ్రప్రదేశ్ కు వచ్చి తెలుసుకుంటున్నాను. నా అనుభవంతో చెబుతున్నను. టెక్నాలజీ చంద్రబాబును చూసి నేర్చుకోవాలన్నారు. పెద్ద ప్రాజెక్టులు తొందరగా చేయాలన్నా దేశంలో చంద్రబాబు నాయుడు కంటే మిన్న ఎవ్వరూ లేరు," అని పేర్కొన్నారు.
ప్రజా రాజధానిని మనమే చేయాలి
2015లో ప్రజల రాజధానిగా నేను శంకుస్థాపన చేశాను. మౌలిక వసతులతో మరింత వేగంతో ముందకు వెళుతుంది. హైకోర్టు, సచివాలయం, రాజ్ భవన్ వంటి వాటికి ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. ఎన్టీఆర్ గారు వికసిత్ ఆంధ్రప్రదేశ్ కోసం కలలు కన్నారు. మనం అందరం కలిసి ఎన్టీఆర్ కలలు నిజం చేయాలి. చంద్రబాబు, పవన్ కల్యాన్ కలిసి చేయాలి. ఇది మనం చేయాలి. మనమే చేయాలి అని చెప్పారు.
పదేళ్లలో భారత దేశం మౌలిక వసతులు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటి కాబోతోంది. ఆంధ్రప్రదేశ్ లో కనెక్టివిటీకి ఒక కొత్త అధ్యాయం మొదలవుతుంది. పక్క రాష్ట్రాలతో అనుసంధానం మెరుగు పడుతుంది. రైతులు పంటను రవాణా ద్వారా బాగా అమ్మకోవచ్చు. రేణిగుంట నుంచి తిరుపతి తక్కువ సమయంలో వెళ్లి వెంకన్న దర్శనం చేసుకుంటారు. అని కనెక్టివిటీ గురించి మాట్లాడారు.
రైల్వేలకు రికార్డు స్థాయిలో నిధులు పెంచాం
ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందిన దేశాలు రైల్వే మీద దృష్టి పెట్టారు. కేంద్రం రికార్డు స్థాయిలో నిధులు పెంచాము. ఏపీకి రూ. 9వేల కోట్లు దాటి బడ్జెట్ అందిస్తున్నాం. పెంచిన రైల్వే బడ్జెట్ వల్ల ఏపీలో వంద శాతం ఎలక్ట్రిఫికేషన్ పూర్తి చేశాం. 750 అండ్ బ్రిడ్జిలు, ప్లై ఓవర్లు, అమృత్ భారత్ పథకం కింద 70 రైల్వే స్టేషన్లు ఏపీలో అభివృద్ధి చేస్తున్నాం. ఇంత భారీ స్థాయిలో అభివృద్ది వల్ల నిర్మాణ రంగం, రవాణా రంగాలకు గణనీయమైన ప్రగతి పదంలో నడుస్తాయన్నారు. ఈ ప్రాజెక్టుల వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.
నేను ఎర్రకోట నుంచి స్పష్టంగా చెప్పాను. వికసిత్ భారత్ కావాలంటే రైతు, యువకులు ముందుండాలన్నారు. రైతు ప్రయోజనాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం. రూ. 12 లక్షల కోట్లు ఎరువుల కోసం ఇచ్చాం. రూ. 5,500 కోట్లు పిఎం కిసాన్ కింద రైతులకు నష్టపరిహారం ఇచ్చాం అన్నారు.
పోలవరం త్వరగా పూర్తవడానికి కలిసి పనిచేస్తాం
దేశ వ్యాప్తంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మిస్తున్నాం. రైతుకు నీటి సమస్య రాకూడదు. పోలవరం ప్రాజెక్టు పనులు వేగం పుంజుకుంది. పోలవరం త్వరగా పూర్తవ్వాలని, ప్రాజెక్టును పూర్తికి కలిసి పనిచేస్తామని తెలియజేస్తున్నాను. మన ఆంధ్రభూమి దశాబ్దాలుగా కోట్లాది మంది భారతీయులను దేశ రక్షణను బలోపేతం చేసే కొత్త డీఆర్డీవో ను లాంచ్ చేశాం. దుర్గమ్మ లాగా శక్తిని ఇస్తుంది అన్నారు.
అనేక నరగాల్లో ఏక్తా మాల్స్ నిర్మిస్తాం..
భారత్ శక్తి ఐక్యతలో ఉంది. దేశంలో అనేక నరగాల్లో ఏక్తా మాల్స్ నిర్మించ బోతున్నాం. ఈరోజు విశాఖపట్నంలో నిర్మించేందుకు శంకుస్థాపన చేశాం. ఏక్ భారత్, శ్రేష్ట్ భారత్ అనే భావనను మరింత బలోపేతం చేస్తుందని భావిస్తున్నానని అన్నారు.
యోగా దినం వరల్డ్ రికార్డు సాధించాలి
అంతర్జాతీయ యోగా దినం కు నన్ను ఆహ్వానించినందుకు నేను సంతోషిస్తున్నను. ఆంధ్రాలో యోగ ప్రచారం చేయడం కాదు. ప్రపంచడం అంతా ఆంధ్రా వైపు చూడాలి. ప్రతి ఊర్లో, వీధిలో, వార్డులో, ఇంట్లో యోగా చేయాలి. వరల్డ్ రికార్డు సాధించేలా చేయాలి. మీ అందరి సమక్షంలో విశాఖలో ఏర్పాటు చేయబోయే కార్యక్రమానికి నేను తప్పకుండా వస్తాను అని హామీ ఇచ్చారు.
అమరావతి పూర్తయితే ఊహించని స్థాయికి జీడీపీ
ఆంధ్రప్రదేశ్ లో కలలు కనే వాళ్ల సంఖ్య తక్కువేమీ కాదు. అభివృద్ధిలో వేగంతో ముందకు వెళుతోంది. దానిని కొనసాగించాలి. ఈ వేగాన్ని పెంచుతూ ఉండాలి. సీఎం చంద్రబాబు మూడు సంవత్సరాల్లో అమరావతి పననులు పూర్తి చేస్తానన్నారు. అప్పుడు జీడీపీ ఏ స్థాయికి వెళుతుందో నేను ఊహించగలను. అది ఆంధ్రప్రదేశ్ చరత్ర మార్చ గలదు. మీ భుజంతో పాటు నా భుజం కూడా కలపి పనిచేస్తాను. కూటమి అభివృకి కట్టుబడి ఉంటుంది అని ప్రధాన మంత్రి మోదీ తన ప్రసంగాన్ని ముగించారు.