ఏపీలో మరో కొత్త పార్టీ

ఆంధ్రప్రదేశ్‌లో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. మాజీ ఐఏఎస్‌ అధికారి జి ఎస్‌ఆర్‌కేఆర్‌ విజయకుమార్‌ ఈ కొత్తపార్టీకి నాంది పలికారు.

Update: 2024-02-15 13:00 GMT
G Srkr Vijay Kumar, rtd IAS

ఆంధ్రప్రదేశ్‌లో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. మాజీ ఐఏఎస్‌ అధికారి జి ఎస్‌ఆర్‌కేఆర్‌ విజయకుమార్‌ ఈ కొత్తపార్టీకి నాంది పలికారు. బుధవారం గుంటూరు వేదికగా పార్టీని ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు విజయ్‌కుమార్‌. ‘లిబరేషన్‌ కాంగ్రెస్‌’ పేరుతో ఈ కొత్త పార్టీ ఏర్పాటైంది. విజయ్‌ కుమార్‌ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్‌ ఆశయాల అమలు, పేద, దళిత వర్గాలకు ఏమి కావాలో తెలుసుకునేందుకు ప్రత్యేకించి పాదయాత్ర నిర్వహించారు.

వైసీపీ నుంచి రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారానికి చెక్‌..
విజయ్‌కుమార్‌ వైఎస్సార్‌సీపీలో చేరి బాపట్ల పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని రాష్ట్ర వ్యాప్తంగా చర్చ సాగింది. పార్లమెంట్‌ కాకుంటే ప్రకాశం జిల్లా సంతనూతలపాడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగుతారనే ప్రచారం జోరుగా సాగింది. ఆ ప్రచారానికి చెక్‌ పెడుతూ కొత్త పార్టీ స్థాపించడం విశేషం. అయితే విజయ్‌కుమార్‌ అంతరంగం ఏమిటో ఇప్పటి వరకు తెలియలేదు. ప్రత్యేక పార్టీ పెట్టడం వెనుక ఎవరైనా ఉన్నారా? తానే ప్రజలకోసం స్థాపించారా అనేతి ప్రజల ఆదరణను బట్టి తెలుస్తుంది. తాను అణగారిన వర్గాల వారికోసం పనిచేసేందుకు పార్టీ పెడుతున్నట్లు విజయ్‌కుమార్‌ ప్రకటించడం విశేషం.
రెండు నెలల్లో ఏమి సాదిద్దామని..
ఏమాహేమీలు, తలపండిన రాజకీయ నాయకులే సంవత్సరాల తరబడి గెలుపుకోసం పోరాడారు. రెండు నెలల్లో కొత్త పార్టీని జనం మధ్యకు తీసుకుపోయి వారి నుంచి ఓట్లు ఎలా రాబట్టుకుంటారో చూడాలి. ఇప్పటికే మాజీ ఐపీఎస్‌ అధికారి జేడీ లక్ష్మీనారాయణ కొత్త పార్టీ స్థాపించి ఏపీలో ఎక్కడా కనిపించడం లేదు. కేవలం ప్రెస్‌మీట్లు, టీవీల్లో మాత్రమే కనిపిస్తున్నారు. వేల కోట్లు లేకుండా ఇప్పుడు రాజకీయాల్లో రాణించడం కష్టంగానే చెప్పొచ్చు. కనీసం ప్రచారానికైనా ఒక్కో నియోకవర్గానికి రూ. 25లక్షల వరకు ఖర్చు చేయాకుంటే ఆ పార్టీ జెండా కనిపించే అవకాశం కూడా లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ కొత్తపార్టీ ఏ వ్యూహంతో ప్రజల ముందుకు ఎలా పోతుందో చూడాలి.
స్వచ్ఛంద సేవలో ముందుకు..
సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. మొదటి నుంచీ అణగారిన వర్గాలపై ప్రేమతో ఉద్యోగం చేశారు. చాలా మంది ఎస్సీ, ఎస్టీల బాగుకు తన వంతు కృషి చేశారు. తన స్వగ్రామంలో ఒక సంస్థను ఏర్పాటు చేసి ఉచితంగా పేదలకు విద్యను అందిస్తున్నారు. అనుకున్నవి సాధించాలంటే ప్రత్యేక పార్టీ పెడితేనే బాగుంటుందని భావించిన విజయ్‌కుమార్‌ నేరుగా పార్టీని ఏర్పాటు చేశారు. రాబోయే ఎన్నికల్లో ఆయన ప్రభావం ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.
ఐఏఎస్‌ అధికారిగా మన్ననలు
ఐఏఎస్‌ అధికారిగా బాగా పనిచేశారని ప్రస్తుత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రశంశల వర్షం కురిపించింది. మంత్రి వర్గ సమావేశంలో ఆయన సేవలను కొనియాడారు. ఉద్యోగం నుంచి విరమణ పొందినప్పటికీ ప్రభుత్వం మరో రెండేళ్లు పదవీ కాలాన్ని పొడిగించింది. ప్రణాళిక శాఖలో డైరెక్టర్‌గా ఉండుటండా అనుకోని విధంగా రాజీనామా చేసి పాదయాత్ర చేపట్టారు. ప్రధానంగా దళిత కాలన్నీల్లో పేదలను కలుసుకుని వారి కష్ట సుఖాలు తెలుసుకున్నారు. దేశం కోసం పోరాడిన, రాజ్యాంగాన్ని రచించి వారి గురించి చెబుతూ, రాజ్యాంగం దళితులకు ప్రత్యేంగా ఇచ్చిన హక్కుల గురించి వివరిస్తూ వచ్చారు. తాను ఎంతో శ్రమకోర్చి పాదయాత్ర ప్రజలకోసం చేస్తుంటే ప్రసారమాధ్యమాలు కనీస ప్రచారం ఇవ్వకపోవడాన్ని పలు చోట్ల ఆయన తప్పు పట్టారు. ప్రసార మాద్యమాలు కేవలం పెత్తందార్లకు కొమ్ము కాస్తున్నాయనే విమర్శలు కూడా పెద్ద ఎత్తున చేశారు.
Tags:    

Similar News