ప్రచారానికి ఇంకా 48 గంటలకే.. ఈరోజు ప్రచారాలు ఇలా..

ఆంధ్రలో ఎన్నికల ప్రచార జోరు పెరిగింది. ప్రచారానికి ఇంకా 48 గంటలే సమయం ఉండటంతో అన్ని పార్టీలు దూకుడు పెంచాయి.

Update: 2024-05-10 03:11 GMT

ఆంధ్రలో ఎన్నికల ప్రచారానికి ఇంకా 48 గంటలే సమయం ఉంది. 11వ తేదీన అన్ని పార్టీలు తమ ప్రచారాలకు స్వస్థి పలకనున్నాయి. ఈ నేపథ్యంలో ఉన్న 48 గంటల్లో వీలైనంత ప్రచారం చేయాలని ప్రతి పార్టీ అధినేత వ్యూహాలు రచిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే తమ రూట్ మ్యాప్‌ను రెడీ చేసుకుంటున్నారు. విజయమే లక్ష్యంగా ఉన్న ప్రధాన పార్టీలు కూడా తమ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేస్తున్నాయి. ఈ రెండు రోజులు ప్రతి పార్టీకి అత్యంత కీలకంగా మారుతున్నాయి. మరి ఈరోజు ఎవరి షెడ్యూల్ ఎలా ఉందంటే..

సీఎం వైఎస్ జగన్.. ఈరోజు ఉదయం 10 గంటలకు గుంటూరు పార్లమెంటు పరిధిలోని మంగళగిరి పాతబస్టాండ్ సెంటర్‌లో ప్రచార సభ నిర్వహించనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12:30 గంటలకు చిత్తూరు పార్లమెంటు పరిధిలోని నగరి నియోజకవర్గంలో, అక్కడి నుంచి మధ్యాహ్నం 3 గంటలకు కడపలోని మద్రాస్ రోడ్ శ్రీపొట్టి శ్రీరాములు సర్కిల్ దగ్గర ముచ్చటగా మూడో సభను వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించనున్నారు. ఈ సభలకు సంబంధించి వైసీపీ శ్రేణులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. రేపు అంటే ప్రచారాలకు ఆఖరి రోజున కూడా మూడు నియోజకవర్గాల్లో పర్యటించే విధంగా జగన్ షెడ్యూల్‌ను రెడీ చేసుకుంటున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి.

ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల.. కడప పార్లమెంటు నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈరోజు ఆమె కడప, విజయవాడలో పర్యటించనున్నారు. ఈరోజు ఇడుపులపాయ నుంచి షర్మిల తన ప్రచారాన్ని ప్రారంబించనున్నారు. అక్కడి నుంచి మైలవరం, వేపరాల, మోరగుడి, కాజేపీట మీదుగా ఆమె ప్రచార పర్యటన సాగనుంది. అక్కడి నుంచి మధ్యాహ్నం 3:40 గంటలకు ఆమె కడప విమానాశ్రయం చేరుకోనున్నారు. సాయంత్రం 4 గంటలకు ప్రత్యేక విమానంలో విజయవాడకు బయలుదేరి 5 గంటలకు విజయవాడ చేరుకుంటారు. సాయంత్రం 6 గంటలకు విజయవాడ జింఖానా గ్రౌండ్స్‌లో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు నిర్వహిస్తున్న బహిరంగ సభలో ఆమె పాల్గొని ప్రసంగిస్తారు. రేపు కడపకు రాహుల్ గాంధీ వీచ్చేయనున్న సందర్బంగా కాంగ్రెస్ పెద్దలు ఈరోజు, రేపు ఆంధ్రలో పర్యటించనున్నారు.

Tags:    

Similar News