పొన్నవోలు.. భద్రత మీకెందుకివ్వాలి..!

ఆంధ్రప్రదేశ్ మాజీ అదనపు అడ్వకేట్ జనరల్, సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డికి భద్రత కల్పించాల్సిన అవసరం ఏముందని హైకోర్టు ప్రశ్నించింది.

Update: 2024-10-14 14:06 GMT

ఆంధ్రప్రదేశ్ మాజీ అదనపు అడ్వకేట్ జనరల్, సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డికి భద్రత కల్పించాల్సిన అవసరం ఏముందని హైకోర్టు ప్రశ్నించింది. ప్రస్తుత ప్రభుత్వం నుంచి ప్రత్యేకించి తెలుగుదేశం నాయకుల నుంచి తనకు ప్రాణానికి ముప్పు ఉందని పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారించిన న్యాయస్థానం.. ఈవేళ ఆ పిటిషన్‌ను కొట్టివేసింది. దీనికి ముందు పొన్నవోలుకు భద్రతపై హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. సుధాకర్ రెడ్డికి భద్రత కల్పించాల్సిన అవసరం లేదని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఆయన పిటిషన్‌ను డిస్‌మిస్ చేస్తూ.. ఆ విషయాన్నే స్పష్టం చేసింది.

గత ప్రభుత్వంలో పొన్నవోలు సుధాకర్ రెడ్డి.. టీడీపీకి వ్యతిరేకంగానూ వైసీపీకి అనుకూలంగానూ వాదనలు వినిపించారు. చంద్రబాబు అరెస్ట్ కేసు విషయంలో కూడా ఆయన విజయవాడలోని ఏసీబీ కోర్టు మొదలు ఢిల్లీలోని సుప్రీంకోర్టు వరకు తన వాదనలు వినిపించారు. ఇటీవల కాలంలో తిరుమల తిరుపతి లడ్డూ వివాదంపై కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టుల పిటిషన్ కూడా దాఖలు చేశారు. శ్రీవారి లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ ఆరోపణలపై సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి న్యాయకత్వంలో విచారణ జరిపించాలని కూడా ఆయన కోరారు.

చంద్రబాబుకు బెయిల్‌పై జరిగిన వాదోపవాదాల సందర్భంలో ఆయన న్యాయవాద వృత్తి ప్రమాణాలకు భిన్నంగా వాదనలు చేశారని ఆరోపణలు వచ్చాయి. ఒక సందర్భంలో ఆయన తనపై హత్యాప్రయత్నం జరిగే అవకాశం ఉందని కూడా ఆనాడు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆయన తన భద్రత కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం ఈవేళ కొట్టివేసింది.

Tags:    

Similar News