అమరావతి రాజధాని యువతకు ఎస్సార్ఎంలో ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణ

ఉచిత రవాణా, శిక్షణ సదుపాయాలతో రాజధాని యువతకు కొత్త అవకాశం;

Update: 2025-09-05 12:00 GMT
SRM యూనివర్సిటీ–AP సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (APCRDA) రాజధాని ప్రాంత యువతకు ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలను చేపట్టింది. సుమారు 3 నెలల పాటు ఈ ఉచిత శిక్షణ కొనసాగుతోంది. పెద్ద సంఖ్యలో యువత ఈ శిక్షణా కార్యక్రమానికి హాజరయ్యారని సీఆర్డీఏ అధికారులు చెప్పారు.

ఈ కార్యక్రమం ద్వారా ఉపాధి అవకాశాలు పెంపొందించడం, స్థిరమైన జీవనోపాధులను సృష్టించడం లక్ష్యంగా పెట్టుకున్నట్టు అధికారులు తెలిపారు. రాజధాని గ్రామాల విద్యార్థులకు ప్రత్యేకంగా ఉచిత రవాణా, శిక్షణ సదుపాయాలు కల్పించారు.
బుధవారం నాడు ప్రారంభమైన ఈ శిక్షణా కార్యక్రమానికి 25 గ్రామాలకు చెందిన 103 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా APCRDA డిప్యూటీ డైరెక్టర్ బొర్ర శ్రీనివాసరావు మాట్లాడుతూ, సామర్ధ్యం పెంపు, మెళకువలపై శిక్షణ కార్యక్రమాలపై సంస్థ దృష్టి సారించినట్టు చెప్పారు. SRM యూనివర్సిటీ ప్రో వైస్-చాన్స్‌లర్ సీహెచ్. సతీష్‌కుమార్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. శిక్షణను వినియోగించుకోవాలని సూచించారు.
ఇంటర్మీడియట్ నుంచి బీటెక్, బీకాం వరకు విద్యార్థులు ఈ శిక్షణలో పాల్గొనవచ్చు. శిక్షణా కాలం రెండు నుంచి మూడు నెలలపాటు కొనసాగనుంది.
Tags:    

Similar News