మంత్రులకు స్వేచ్ఛ ఉందా?
ఆంధ్రప్రదేశ్‌లో మంత్రులకు స్వేచ్ఛ ఉందా? ముఖ్యమంత్రి చెప్పనట్లు చేయాల్సిందేనా? స్వతంత్రంగా మాట్లాడే మంత్రులు ఒకరిద్దరే గత ప్రభుత్వంలో ఉన్నారు. మరి నేడు..
రాను రాను ప్రజాస్వామ్య రాజకీయాల్లో నియంత ధోరణులు వస్తున్నాయి. మంత్రులకు సైతం మాట్లాడే స్వచ్ఛ లేకుండా పోయింది. ఏది మాట్లాడాలన్నా ముఖ్యమంత్రి అనుమతి తీసుకోవాల్సిందే. కనీసం మంత్రి శాఖలకు సంబంధించిన వివరాలు వెల్లడించాలన్నా సీఎం అనుమతి తీసుకోవాల్సిందే. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో జరిగింది ఇదే. మంత్రులు, ఎమ్మెల్యేలు గత ప్రభుత్వంలో వారి మనసుకు నచ్చిన మాట మాట్లాడేందుకు వీలుండేది కాదు. మంత్రులు ఏదైనా మాట్లాడాలనుకుంటే సీఎంవో నుంచి ఒక నోట్ వచ్చేది. ఆ నోట్‌లో న్న వివరాలు మాత్రమే వెల్లడించాలి. ఇక ఐదేళ్ల కాలంలో ప్రభుత్వ కార్యక్రమాల గురించి వివరించేందుకు కానీ, రాజకీయాల గురించి మాట్లాడేందుకు కానీ మీడియాతో వైఎస్ జగన్ మాట్లాడిన సందర్బం లేదని చెప్పొచ్చు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయన మాటగా జగన్ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడేవారు. అందుకే ఎమ్మెల్యేలు, మంత్రుల్లో జగన్ అంటే తీవ్ర వ్యతిరేకత వచ్చింది. పైగా డబ్బలు ఉన్న వారిని ఎంపిక చేసి టికెట్లు ఇచ్చారు. కోటాను కోట్లు ఎన్నికల్లో ఖర్చు పెట్టించారు. తిరిగి ఆ డబ్బును రాబట్టుకునేందుకు నాయకులు నానా తంటాలు పడేవారు.