బాపట్ల జిల్లాలో ఘోర ప్రమాదం

న్యూ ఇయ్యర్ రోజు ముగ్గురు ప్రాణాలు పోగొట్టుకున్నారు.;

Update: 2025-01-01 08:27 GMT

నూతన సంవత్సరం రోజు ఓ దారుణం జరిగింది. స్పాట్‌లోనే ముగుర్గు మరణించిన ఘోర ప్రమాదం ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లాలో చోటు చేసుకుంది. బాపట్ల జిల్లా మార్టూరు మండలం డేగరమూడి సమీపంలో నేషనల్‌ హైవే 16 మీద బుధవారం ఉదయం ఈ యాక్సిడెంట్‌ చోటు చేసుకుంది. బైక్‌ మీద ప్రయాణిస్తున్న వారు అక్కిడికక్కడే ఘటనా స్థలంలోనే మృత్యువాత పడ్డారు. వేగంగా వస్తున్న ఓ లారీ వెనుక నుంచి బైక్‌ను ఢీ కొట్టడంతో ఈ ఘోర ఘటన చోటు చేసుకుంది. లారీ బలంగా ఢీ కొట్టడంతో బైక్‌ మీద ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు స్పాట్‌లోనే ప్రాణాలు పోగొట్టుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.


Tags:    

Similar News