భగ్గుమన్న వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త

సీటు నీకేనని చెప్పి తర్వాత సీటు కోల్పోయిన వారు వైఎస్సార్‌సీపీపై నిప్పులు చెరుగుతున్నారు. చిలకలూరిపేట సమన్వయకర్త మంగళవారం మంత్రి విడదల రజనీపై నిప్పులు చెరిగారు.

Update: 2024-03-12 14:33 GMT
Ch pet ysrcp cordinator

వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను మార్చే కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే ఉంది. ఒక సారి సమన్వయ కర్తగా ప్రకటించిన వ్యక్తిని కాదని మరొకరికి టిక్కెట్‌ కన్‌ఫాం చేస్తుండటంతో నాయకుల్లో ఆవేశం కట్టలు తెంచుకుంటోంది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త పార్టీ నాయకులపై నిప్పులు చెరిగారు.

తీసుకున్న డబ్బులు ఇవ్వకుంటే వదులుతామా..
వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని చిలకలూరిపేటలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో జెండావిష్కరణ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సమన్వయకర్త మల్లెల రాజేష్‌నాయుడు మాట్లాడుతూ ఒక్కసారిగా పార్టీలో ముఖ్య నాయకుల తీరుపై బరస్ట్‌ అయ్యారు. ఖచ్చితంగా నేను చెబుతున్నానన్నా నాకు కాదంటే మర్రి రాజశేఖర్ కు ఇస్తే నేను 20 కోట్లు ఖర్చుపెడతా. లేదంటే ఎవరికి ఇచ్చుకుంటారో ఇచ్చుకోండి. మాదగ్గర కోట్లు కొట్టేశారు. మంత్రి విడదల రజనీ నావద్ద ఆరున్నర కోట్లు తీసుకుంది. అందులో మూడు కోట్లు ఇచ్చింది. మిగిలిన డబ్బులు ఇవ్వలేదు. ఇదుగో ఇతని దగ్గర రెండున్నర కోట్లు తీసుకుంది. ఈ విషయాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర చెప్పా. ఆయన పోనీలే అంటున్నాడు. ఎలా పోనిస్తాం అంటూ ఆవేశంగా మాట్లాడారు. జెండావిష్కరణ కార్యక్రమానికి వచ్చిన కార్యకర్తలు ముందు సజ్జలను దంచండి.. పార్టీని బతికించండి అంటూ కేకలు వేశారు. రాజేష్‌నాయుడు చిలకలూరిపేటకు చెందిన వారు. అందుకే ఆయనను సమన్వయకర్తగా నియమించారు. ఇప్పుడు ఎందుకు మార్చాలనుకుంటున్నారో పార్టీ చెప్పలేదు. సీఎం ఆఫీస్ కు పిలిపించి ఇద్దరు మాట్లాడారు నేను భయపడతానా, అంటూ ఆవేశంతో మాట్లాడారు. 
చిలకలూరిపేట నుంచి మంత్రి విడదల రజనీని గుంటూరుకు మార్చారు. అక్కడ మద్దాల గిరిని కాదని రజనీని నియమించడంతో నిప్పు రాజుకుంది. దాన్ని కొంతవరకు సద్దుమణిగించారు. విడదల రజనీ సీట్లు ఇప్పిస్తానని కొందరి నుంచి కోట్లు గుంజినట్లు ప్రచారం జరుగుతోంది. మల్లెల రాజేష్‌నాయుడు ఆరోపణతో అది నిజమేనని నమ్మాల్సి వస్తోంది. ఇప్పుడు సోషల్‌ మీడియాలో ఇది హాట్‌ టాపిక్‌గా మారింది. ఇంకా ఎంత మంది ఇలా ఆవేశంతో ముందకు వస్తారోన నే అనుమానాలు కూడా పార్టీ నేతల్లో వ్యక్తమవుతున్నాయి.
చిలకలూరిపేట నుంచి మనోహర్‌నాయుడు?
చిలకలూరిపేట నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా గుంటూరుకు మేయర్‌ కావటి మనోహర్‌నాయుడును రంగంలోకి దించాలని వైఎస్‌ జగన్‌ ఆలోచిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. మర్రి రాజశేఖర్‌ కూడా రేస్‌లో ఉన్నట్లు రాజేష్‌నాయుడు నోటి నుంచి వచ్చింది. గుంటూరు నుంచి తెచ్చుకుంటారో, విజయవాడ నుంచి తెచ్చుకుంటారో మా డబ్బులు వదులుతామా అంటూ రాజేష్‌ నాయుడు సమావేశంలో మాట్లాడారు. మంత్రి రజనీ సీఎం వద్ద చక్రం తిప్పి తాను చెప్పిన అభ్యర్థికి టిక్కెట్‌ ఇప్పించుకుంటుందనే ప్రచారం కూడా సాగుతోంది.
Tags:    

Similar News