మహిళలే లక్ష్యంగా నారా భువనేశ్వరి

ముల్లును ముల్లుతోనే తీయాలనే సామెత వినే ఉంటారు. తెలుగుదేశం ఆ సామెతను తూచా తప్పకుండా పాటిస్తున్నట్లుంది. ఇప్పటికే ఇంటిల్లిపాది ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారు.

Update: 2024-02-09 07:23 GMT
Nara Bhuvaneswari

చంద్రబాబునాయుడు రా కదిలిరా సభల్లో చురుకుగా పాల్గొంటుండగా ఆయన సతీమణి భువనేశ్వరి చంద్రబాబు జైల్లో ఉండగా బాధతో చనిపోయిన కుటుంబాల వారిని పరామర్శిస్తూ నిజం గెలవాలి అంటూ సభలు పెడుతున్నారు. ఆ కార్యక్రమమే కాకుండా మహిళలను కలవడం పనిగా పెట్టుకున్నారు. మహిళలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.

రాజధాని గ్రామాలే టార్గెట్‌గా..

Delete Edit

సమయం దొరికినప్పుడల్లా రాజధాని గ్రామాల్లో భువనేశ్వరి పర్యటిస్తున్నారు. గురువారం రాజధాని గ్రామమైన వెంకటపాలెంలో నిర్వహించిన సభలో ఆమె చేసిన ప్రసంగం, మహిళలు అడిగిన ప్రశ్నలకు చెప్పిన సమాధానాలు పలువురిని ఆకట్టుకున్నాయి. సభ నిర్వహించిన తీరు న్యాచురల్‌గా ఉంది. మంచం వేసి మంచంపైనే కూర్చుని మాట్లాడారు. దూరంగా అక్కడక్కడ మంచాలు వేసుకుని జనం భువనేశ్వరి చెప్పిన మాటలు ఆసక్తిగా విన్నారు. గ్రామంలో ప్రజలు ఎక్కడి వారు అక్కడ కూర్చుని వింటున్నట్లుగా సభా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
మీ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీ భర్త ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీరెందుకు రాజకీయాల్లోకి రాలేదంటూ ఒక మహిళ ఆసక్తిగా ప్రశ్నించారు. ఆమె ప్రశ్నకు భువనేశ్వరి సమాధానమిస్తూ నేనెప్పుడూ రాజకీయాల్లోకి రావాలనుకోలేదు. అసలు రాజకీయాలపైనే ఆసక్తి లేదు. అనవసరంగా చంద్రబాబునాయుడును జైల్లో పెట్టారు. ఇప్పటికీ ఆయనపై కేసులు పెడుతూనే ఉన్నారు. 53 రోజులు జైల్లో ఉంచారు. జైల్లో ఉండగా చంద్రబాబునాయుడు పిలిచి నాకోసం మరణించిన వారి కుటుంబాలను పరామర్శించి ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పారు. అందువల్ల రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. నిజం గెలవాలి పేరుతో నాలుగు మాటలు వారికి చెబుతున్నానని చెప్పడం పలువురి దృష్టిని ఆకర్షించింది.
చంద్రబాబు వదిలిన భువనాస్త్రం
చంద్రబాబు చెప్పడం వల్లే నేను రాజకీయాల్లోకి రావాల్సి వచ్చిందని స్వయంగా భువనేశ్వరి చెప్పారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు. నిజం గెలవాలంటూ పెట్టిన సభలు సక్సెస్‌ అయ్యాయి. దీంతో ఆమె రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు. అమరావతి ఉద్యమానికి ఊపునిస్తున్నారు. వెంకటపాలెంలో ఒక మహిళ రాజధానిగా అమరావతి ఉంటుందా? ఉండదా? అన్న ప్రశ్నకు తప్పకుండా ఉంటుందని అక్కడి మహిళల్లో భరోసా నింపారు. మహిళను చేతులు పట్టుకుని ఆప్యాయంగా పలకరిస్తూ వెంకటపాలెం అంతా కలియ తిరిగారు. ఇంట్లో వారితో మాట్లాడినట్లు మాట్లాడటం, కుశల ప్రశ్నలు వేస్తూ సాగుతుండటంతో అక్కడి మహిళలు కూడా బాగా ఓన్‌ చేసుకున్నారు.

Delete Edit
మహిళా పాడి రైతులతో రాజకీయ ముచ్చట్లు
తాడికొండ నియోజకవర్గంలోని మహిళా పాడి రైతులతో ముఖాముఖి కార్యక్రమం సందర్భంగా పలు రాజకీయ ముచ్చట్లు జరిగాయి. చంద్రబాబునాయుడును వైసీపీ వారు ఎలా వేదిస్తున్నారో చెబుతూ ఏది జరిగినా మహిళల్లో ధైర్యం ఉండాలని చెప్పారు. మగవాళ్లకంటే ఆడవాళ్లే గొప్పని చెబుతూ ఇంటి పనులు చూసుకుంటుంది. ఆర్థికంగా ఇంటిని చక్కదిద్దుతుంది. పిల్లలను పెంచడం దగ్గర నుంచి అన్నీ తానై ముందుకు సాగుతుంది. మగవాళ్లు కేవలం సంపాదనకే పరిమితమవుతారని చెప్పడంతో అక్కడి వారంతా చప్పట్లు కొట్టారు.
హెరిటేజ్‌ కోసం ఒకడుగు ముందుకు
ఆంధ్రప్రదేశ్‌లో హెరిటేజ్‌ను దెబ్బ తీసేందుకు అమూల్‌ను సీఎం వైఎస్‌ జగన్‌ రంగంలోకి దించారు. దీంతో ఎలా పాడిరైతులను ఆకట్టుకోవాలో ఆలోచించి మహిళా పాడి రైతులతో ముఖాముఖి అంటూ కార్యక్రమాలు అక్కడక్కడ టీడీపీ వారు ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవల మందడం గ్రామం వెళ్లినప్పుడు అక్కడి అమరావతి ఉద్యమకారులను చూసి తన చేతి బంగారు గాజులు ఉద్యమానికి కానుకగా ఇచ్చి అక్కడి మహిళల మనసును దోచుకున్నారు. ఇలా ప్రతి అంశంలోనూ రాజధాని కుటుంబాలకు నారా భువనేశ్వరి దగ్గరవుతున్నారు. గత ఎన్నికల్లో తాడికొండ నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌సీపీ గెలుపొందింది. అయితే మూడు సంవత్సరాల తరువాత ఎమ్మెల్యే డాక్టర్‌ శ్రీదేవి వైఎస్సార్‌సీపీకి దూరమయ్యారు. ప్రస్తుతం తాడికొండ నియోజరవక్గ ఇన్‌చార్జ్‌గా మాజీ హోం మంత్రి మేకతోటి సుచరితను వైఎస్సార్‌సీపీ నియమించింది. తెలుగుదేశం పార్టీ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. ఈ గ్రామాల్లో టీడీపీ పట్టు సాధించేందుకు భువనేశ్వరి నిజం గెలవాలి, మహిళా పాడి రైతులతో సభలు, సమావేశాలు, చంద్రబాబు జైలుకు వెళ్లిన సమయంలో మృతి చెందిన కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తూ ముందుకు సాగుతున్నారు.
Tags:    

Similar News