ఏపీ అభివృద్ధికి సహకరిస్తానన్న బిల్ గేట్స్.. చంద్రబాబు ట్వీట్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్చి 19న ఢిల్లలో మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌(Bill Gates)తో భేటీ అయ్యారు.;

Update: 2025-03-19 10:55 GMT
బిల్ గేట్స్ తో భేటీకి వెళుతున్న చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్చి 19న ఢిల్లలో మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌(Bill Gates)తో భేటీ అయ్యారు. వీరిద్దరూ సుమారు 40 నిమిషాల పాటు వివిధ అంశాలపై చర్చించారు. భేటీ అనంతరం బిల్‌గేట్స్‌తో జరిగిన చర్చలకు సంబంధించిన వివరాలను సీఎం చంద్రబాబు ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు.

‘‘బిల్ గేట్స్‌తో అద్భుతమైన సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వంతో గేట్స్ ఫౌండేషన్ సహకారంపై కీలక చర్చలు జరిపాం. ఆరోగ్య సంరక్షణ, విద్య, వ్యవసాయం, ఉపాధి కల్పన వంటి కీలక రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రిడిక్టివ్ అనలిటిక్స్ వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాల వినియోగంపై చర్చించాం. స్వర్ణ ఆంధ్రప్రదేశ్-2047 దార్శనికతను సాకారం చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది. గేట్స్ ఫౌండేషన్‌తో ఈ భాగస్వామ్యం మన ప్రజలను శక్తిమంతం చేయడంతో పాటు ఈ లక్ష్యాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషిస్తుందని నేను విశ్వసిస్తున్నాను’’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పురోగతికి బిల్ గేట్స్ తన సమయం ఇచ్చినందుకు చంద్రబాబు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు.
"ప్రతి పౌరుడికి అందుబాటులో ఉండేలా నాణ్యమైన ఆరోగ్య సేవలను నిర్ధారించడానికి తమమధ్య సహకార ఒప్పందాన్ని పునరుద్ధరించేందుకు ఎదురు చూస్తున్నాం," అని ఎక్స్‌లో పేర్కొన్నారు.
అభివృద్ధికి AI, ప్రిడిక్టివ్ అనలిటిక్స్
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుతో జరిగిన సమావేశంలో, ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, ఉపాధి రంగాలలో సేవా అందకాన్ని మెరుగుపరిచేందుకు కృత్రిమ మేధస్సు (AI), ప్రిడిక్టివ్ అనలిటిక్స్‌ను ఎలా వినియోగించుకోవచ్చో గేట్స్ చర్చించారు.

గేట్స్ ఫౌండేషన్‌తో భాగస్వామ్యం, రాష్ట్రం ఆకాంక్షిస్తున్న దీర్ఘకాలిక అభివృద్ధి లక్ష్యమైన స్వర్ణ ఆంధ్రప్రదేశ్ 2047 సాధనలో కీలక పాత్ర పోషిస్తుందని నాయుడు తెలిపారు.
"ఈ సహకారం ప్రజలను శక్తివంతం చేసేందుకు, అభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడంలో కీలక భూమిక పోషిస్తుంది," అని నాయుడు ఎక్స్‌లో రాశారు.
గేట్స్ పర్యటనలో ఆయన పార్లమెంట్‌ను కూడా సందర్శించారు. బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న తీరును పరిశీలించారు.
Tags:    

Similar News