తిరుమలకు బ్రహ్మెత్సవ కళ.. చురుగ్గా ఏర్పాట్లు
శ్రీవారి ఉత్సవాల్లో వాహనసేవల వివరాలు ఇవీ..;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-09-01 11:52 GMT
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుమలలో ఈ నెల 24వ తేదీ నుంచి అక్టోబర్ రెండో తేదీ వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. అందులో భాగంగా, ఉదయం, రాత్రి వేళల్లో శ్రీవారి ఉత్సవమూర్తులను ఆలయ మాడవీధుల్లో ఊరేగించనున్నారు. ఉత్సవ మూర్తులను ఊరేగించే సమయాలను టీటీడీ వెల్లడించింది. బ్రహ్మెత్సవాల నేపథ్యంలో ఆలయం, పరిసరాలు, మాడవీధులు, వాహనమండపాలను రంగులతో అదంగా అలంకరించే పనులు చురుగ్గా సాగుతున్నాయి.
తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సెప్టెంబర్ 23వ తేదీ సాయంత్రం అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. దీనికి ముందుగా ఈ నెల 16వ తేదీ శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు.
బ్రహ్మోత్సవాల్లో రోజూ ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు. సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల గంటల వరకు వాహనసేవలు నిర్వహిస్తారు. ఉభయ దేవేరులతో శ్రీవారి ఉత్సవమూర్తులను ఊరేగిస్తారు.
వాహన సేవల వివరాలు
24వ తేదీ సాయంత్రం 05:43 నుంచి 6.15 గంటల మధ్య మీనలగ్నంలో ధ్వజారోహణం, రాత్రి 9 గంటలకు పెద్ద శేష వాహనం.
25వ తేదీ ఉదయం 8 గంటలకు చిన్న శేష వాహనం, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు స్నపనం, రాత్రి 7 గంటలకు హంస వాహనం.
26వ తేదీ ఉదయం 8 గంటలకు సింహ వాహనం, మధ్యాహ్నం 1 గంటకు స్నపనం, రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహనం
27వ తేదీ ఉదయం 8 గంటలకు కల్పవృక్షం వాహనం,
మధ్యాహ్నం ఒంటి గంటకు స్నపనం, రాత్రి 7 గంటలకు సర్వ భూపాల వాహనం
28వ తేదీ ఉదయం 8 గంటలకు మోహినీ అవతారం, సాయంత్రం 6:30 నుండి రాత్రి గరుడ వాహనం
29వ తేదీ ఉదయం 8 గంటలకు హనుమంత వాహనం, సాయంత్రం 4 గంటలకు స్వర్ణ రథం, రాత్రి 7 గంటలకు గజ వాహనం
30వ తేదీ ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనం, రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనం
అక్టోబర్ ఒకటవ తేదీ ఉదయం 7 గంటలకు రథోత్సవం, రాత్రి 7 గంటలకు అశ్వ వాహనం
అక్టోబర్ రెండో తేదీ ఉదయం 6 నుంచి 9 వరకు చక్రస్నానం, రాత్రి 8:30 నుండి 10 గంటల వరకు ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు సమాప్తం అవుతాయి.