తిరుమల అన్నప్రసాదంలో కాళ్లజెర్రి

తిరుమలలో మరో అపచారం జరిగింది. భక్తులకు వడ్డించే అన్నప్రసాదంలో కాళ్లజెర్రి వచ్చింది. అన్నదాన కేంద్రంలో వడ్డించే పెరుగన్నంలో ఈ జెర్రి వచ్చింది.

Update: 2024-10-05 13:34 GMT

తిరుమలలో మరో అపచారం జరిగింది. భక్తులకు వడ్డించే అన్నప్రసాదంలో కాళ్లజెర్రి వచ్చింది. అన్నదాన కేంద్రంలో వడ్డించే పెరుగన్నంలో ఈ జెర్రి వచ్చింది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చి ఓ భక్తుడు టీటీడీ మాధవ నిలయం అన్నదాన కేంద్రంలో భోజనం చేయడానికి వెళ్లారు. అక్కడ భోజనం చేస్తుండగా పెరుగు అన్నంలో జెర్రి వచ్చింది. దీంతో అతడు వెంటనే అధికారులకు ఫిర్యాదు చేశాడు. కాగా ఈ అంశంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉంటారంటూ భక్తులు అధికారులను నిలదీస్తున్నారు. భక్తుల ప్రాణాలంటే లెక్కలేదా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా తాము ప్రశ్నిస్తే తమకు అత్యంత నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారని, పైగా పోండంటూ లెక్కలేని తనంగా ప్రవర్తిస్తున్నారని భక్తులు మండిపడుతున్నారు. ఇంతటి నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.

సీఎం మాటంటే లెక్కలేదా..

ఈరోజు ఉదయం టీటీడీ అధికారులకు సీఎం చంద్రబాబు కీలక హెచ్చరికలు చేశారు. నడవడిక, అన్నదానం విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఆయన అలా హెచ్చరించిన గంటల వ్యవధిలోనే ఒక భక్తుడికి వడ్డించిన అన్నప్రసాదంలో జెర్రి రావడం, ఇదేంటని ప్రశ్నిస్తే అధికారులు నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారని భక్తులు మండిపడటం కీలకంగా మారాయి. సీఎం మాట, హెచ్చరికలంటే అధికారులకు ఏమాత్రం లెక్కలేదా అన్న అనుమానాలను కలిగిస్తున్నాయి.

Tags:    

Similar News