మోదీ వచ్చిన వేళ.. ఏపీకి గ్రీన్ ఎనర్జీ కారిడార్‌

ఏపీకి ఇచ్చిన గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఎందుకు పనికివస్తుందంటే...

Update: 2025-10-16 10:32 GMT
ఆంధ్రప్రదేశ్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం మరో వరాన్ని ప్రకటించింది. పునరుత్పత్తి ఇంధన వినియోగాన్ని పెంపొందించడమే లక్ష్యంగా కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి (CERC) ఆంధ్రప్రదేశ్‌లో గ్రీన్ ఎనర్జీ కారిడార్ (GEC)–ఫేజ్‌–3 ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా సుమారు ₹21,800 కోట్ల వ్యయంతో కొత్త విద్యుత్ ప్రసార లైన్లు, సబ్‌స్టేషన్లు నిర్మితమవుతాయి. వీటి ద్వారా రాష్ట్రంలోని వాయు, సౌర విద్యుత్ కేంద్రాల నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను అనంతపురం – కడప – నెల్లూరు – రామాయపట్నం మార్గం ద్వారా దక్షిణ భారత విద్యుత్ గ్రిడ్‌కు కలపనున్నారు.
గ్రీన్ ఎనర్జీ కారిడార్ ప్రాజెక్ట్‌ ఉద్దేశ్యం పునరుత్పత్తి విద్యుత్‌ను సమర్థంగా ప్రసారం చేయడం, దేశవ్యాప్తంగా గ్రీన్ పవర్ వినియోగాన్ని పెంచడం. ఇలా చేయడం వల్ల బొగ్గు, గ్యాస్‌పై ఆధారపడే పరిస్థితిని తగ్గించడం. కార్బన్ ఉద్గారాలను తగ్గించడం లక్ష్యాలు.
ఈ ప్రాజెక్ట్‌కు కేంద్ర ప్రభుత్వం 33 శాతం వరకు నిధులు అందించగా, మిగతా వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఇతర ఆర్థిక సంస్థలు భరిస్తాయి. కేంద్రం ఈ ప్రాజెక్టు వ్యయంలో 33 శాతం (రూ.6,560 కోట్లు) గ్రాంటు కింద ఇచ్చేందుకు ఓకే చెప్పింది. అయితే మిగిలిన రూ.15 వేల కోట్లు వ్యయాన్ని ట్రాన్స్‌కో వెచ్చించనుంది. కేంద్రం నుంచి డిసెంబరుకు ప్రాజెక్టుకు అనుమతులు వస్తాయని భావిస్తున్నారు. ఈ పననులు 2026-27లో ప్రారంభించి రెండేళ్లలో పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు.
ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా 8,800 కిలోమీటర్లకు పైగా విద్యుత్‌ ప్రసార లైన్లు, కొత్త సబ్‌స్టేషన్లు ఏర్పాటు అవుతాయి. వీటి ద్వారా రాష్ట్రంలోని వాయు, సౌర విద్యుత్ కేంద్రాల నుంచి సుమారు 11,000 మెగావాట్ల విద్యుత్‌ను ప్రధాన విద్యుత్ గ్రిడ్‌తో కలపనున్నారు. రాష్ట్రంలోని వాయు, సౌర విద్యుత్ కేంద్రాలు ఎక్కువగా ఉన్న రాయలసీమ, తీర ప్రాంతాలను ఈ లైన్ తాకనుంది.
అదనంగా 7,373 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు, 9,500 ఎంవీఏ ట్రాన్స్‌ఫార్మర్ సామర్థ్యం కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రం గ్రీన్ పవర్ ఉత్పత్తిలో ముందంజలో నిలిచి, ఇతర రాష్ట్రాలకు విద్యుత్ ఎగుమతి చేసే సామర్థ్యం పెరగనుంది.
ఈ ప్రాజెక్టులో భాగంగా సుమారు 350 కిలోమీటర్ల మేర విద్యుత్‌ పంపిణీ లైన్లను ఏర్పాటు చేస్తారు. రాష్ట్రంలో 72,000 మెగావాట్ల సోలార్, విండ్, పంప్డ్‌ స్టోరేజ్‌ విద్యుత్‌ ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. వీటిలో ఎక్కువ భాగం రాయలసీమలోనే ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల నుంచి వచ్చే విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానించడానికి ట్రాన్స్‌కో సొంతంగా నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ లైన్లను వాడితే భారీ ఛార్జీలు చెల్లించాల్సి వస్తుందని, అందుకే ఈ నిర్ణయం తీసుకుంది. గ్రీన్‌ ఎనర్జీ కారిడార్‌-1 కింద అనంతపురం జిల్లాలో ఇప్పటికే నెట్‌వర్క్‌ను ట్రాన్స్‌కో అభివృద్ధి చేసింది. ఇప్పుడు జీఈసీ-3 కింద కొత్త లైన్లను ఏర్పాటు చేయనుంది.
పునరుత్పత్తి విద్యుత్ ఉత్పత్తిలో ముందంజలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ఈ ప్రాజెక్ట్‌ ద్వారా విద్యుత్ ఎగుమతిదారుగా (Power Exporting State) మారే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
అసలు ఏమిటీ కారిడార్...
“గ్రీన్ ఎనర్జీ కారిడార్ (Green Energy Corridor - GEC)” అనేది పునరుత్పత్తి ఇంధనం (renewable energy). అంటే సౌర, వాయు, జలవిద్యుత్ వంటి వనరుల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ ను ప్రధాన గ్రిడ్‌కు సురక్షితంగా కలిపే ప్రత్యేక విద్యుత్‌ ప్రసార మౌలిక వసతుల ప్రాజెక్ట్‌.
ఇది దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ప్రాజెక్ట్, దీని ఉద్దేశం రాష్ట్రాలు ఉత్పత్తి చేసే గ్రీన్‌ పవర్‌ను దేశవ్యాప్తంగా సరఫరా చేయడం.
గ్రీన్ ఎనర్జీ కారిడార్‌లో ఏం జరుగుతుంది?
ప్రత్యేక ట్రాన్స్‌మిషన్ లైన్లు నిర్మిస్తారు. వాయు విద్యుత్ ప్లాంట్లు (విండ్ ఫార్ములు), సౌర విద్యుత్ ప్లాంట్ల నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను ప్రధాన విద్యుత్‌ గ్రిడ్‌కి తీసుకెళ్లే కొత్త లైన్లు ఏర్పాటు చేస్తారు. ఇవి 400 కిలోవోల్ట్ లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యం కలిగిన హై-వోల్టేజ్ లైన్లు.
సబ్‌స్టేషన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు
విద్యుత్‌ను ప్రసారం చేసే మధ్యలో పెద్ద సబ్‌స్టేషన్లు నిర్మించి, వోల్టేజ్ స్థాయిలను నియంత్రిస్తారు.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రాజెక్ట్ వివరాలు
Phase–3 ప్రాజెక్ట్‌ కు ఇటీవల CERC (Central Electricity Regulatory Commission) అనుమతి ఇచ్చింది. ₹21,800 కోట్ల అంచనా వ్యయం. ఇది అనంతపురం – కడప – నెల్లూరు – రామాయపట్నం మార్గంలో విద్యుత్‌ ప్రసార లైన్లతో విస్తరించనుంది.
ప్రాజెక్ట్ ప్రాముఖ్యత
-గ్రీన్ పవర్ వినియోగాన్ని పెంచడం
-బొగ్గు, గ్యాస్‌పై ఆధారాన్ని తగ్గించడం
-విద్యుత్‌ ఉత్పత్తిలో కార్బన్ ఉద్గారాలను తగ్గించడం
-రాష్ట్రానికి ఎగుమతి అవకాశాలు — అంటే ఇతర రాష్ట్రాలకు విద్యుత్ అమ్మే అవకాశం
అంటే సులభంగా చెప్పాలంటే, గ్రీన్ ఎనర్జీ కారిడార్ అంటే “సౌర, వాయు విద్యుత్‌ను దేశ వ్యాప్తంగా పంపించడానికి ఏర్పాటు చేసే ప్రత్యేక హైవే” లాంటిదే.
Tags:    

Similar News