అవి పాపిస్టి డబ్బులు..ఆ కుటుంబాలు బాగుపడవు
భారత దేశానికి రైట్ టైమ్‌లో రైట్ లీడర్ ప్రధాని నరేంద్ర మోదీ అని, అందుకే ఢిల్లీ ప్రజలు ఆయనను నమ్మి గెలిపించారని చంద్రబాబు అన్నారు.;
By : The Federal
Update: 2025-02-08 12:53 GMT
లిక్కర్‌తో సంపాదించిన డబ్బులు పాపిస్టి డబ్బులని, ఆ విధంగా సంపాదించిన కుటుంబాలు బాగుపడవని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కామ్ ఏపీతో పోల్చితే నథింగ్ అని చంద్రబాబు అన్నారు. లిక్కర్‌తో పేదవారి ఆరోగ్యాలను పాడు చేసి.. ఎంజాయ్ చేసే అధికారం పాలకులకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. న్యూట్రిషన్ వాల్యూస్ ఉండే లిక్కర్ విధానం ఇప్పటికే రెండు సార్లు తెచ్చానని, కానీ గత ప్రభుత్వం రా లిక్కర్‌ను సప్లై చేసిందన్నారు. ఇష్టా రాజ్యంగా వ్యవహరించిందని ధ్వజమెత్తారు.
పరిపాలనలో పీపుల్ ఫస్ట్ మోడలే వర్కవుట్ అవుతుంది. దేశంలో ఒక సస్టైనబుల్ మోడల్ పాలనను క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ ఆ సస్టైనబుల్ మోడల్‌ను క్రియేట్ చేశారు. దాని ప్రకారంగా పాలన అందిస్తున్నారు. దీనిని అభినందిస్తున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. శనివారం ఉండవల్లిలోని తన నివాసంలో ఢిల్లీ ఫలితాలపై చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రధాని మోదీ మీద ఉన్న నమ్మకాన్ని ఢిల్లీ ప్రజలు బలపరిచారు. ఎన్నికల్లో గెలిపించారని అన్నారు.
అభివృద్ధి జరగాలి. డెవలప్‌మెంట్ జరిగితే సంపద సృష్టించబడుతుంది. సంపద సృష్టించబడితే ఆదాయం పెరుగుతుంది. ఆ ఆదాయం ఖర్చు పెడితే సంక్షేమ కార్యక్రమాలు ఎక్కువ చేయగలుగుతాం. మళ్లీ డెవలప్‌మెంట్‌కు ఫండ్స్ ఉంటాయి. దీని వల్ల ప్రజలను ఎప్పటికప్పుడు ఎంపవర్ చేసుకుంటూ.. తలసరి ఆదాయం పెంచి మెరుగైనా జీవన ప్రమాణాలను ఇవ్వడానికి అవకాశం వస్తుంది. ఇది సింపుల్ థియరీ. అంటూ పరిపాలన మోడల్‌ను వివరించారు.
దీనిని ఎవరైతే సమర్థవంతంగా చేస్తారో.. గుడ్ డెవలప్‌మెంట్.. గుడ్ పాలిటిక్స్, గుడ్ గవర్నెన్స్.. గుడ్ పాలిటిక్స్ సాధ్యం అవుతుందన్నారు. ఒక సుపరిపాలనను అందించగలిగితే అది మంచి రాజకీయాలకు కూడా నాంది పలుకుతుంది. దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రారంభించి 34 ఏళ్లు గడిచాయి. వీటిని తెలుగు బిడ్డ పీవి నరసింహారావు తెచ్చారు. దీని ఫలితంగా తలసరి ఆదాయంలో మహారాష్ట్ర 1995–2024 మధ్య తొమ్మిది రెట్లు గ్రోత్ సాధించింది. గుజరాత్ 15 రెట్లు గ్రోత్ సాధించింది. వెస్ట్‌బెంగాల్ 4.7 రెట్లు పెరిగింది. తమిళనాడు 8 రెట్లు పెరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 12 రెట్లు పెరిగింది. కర్ణాటక ఏడు రెట్లు పెరిగింది. యుపి 9 రెట్లు పెరిగింది. రాజస్ధాన్ ఐదు రెట్లు పెరిగిందన్నారు.
భారత దేశానికి రైట్ టైమ్‌లో రైట్ లీడర్ ప్రధాని నరేంద్ర మోదీ అని అన్నారు. అందుకే ఢిల్లీ ప్రజలు బీజేపీ కూటమిని గెలిపించారని అన్నారు. సంక్షేమం ఇస్తున్నట్లు చెప్పుకుంటూ.. ప్రజలను మోసం చేశారని.. దీనికి మాజీ సీఎం జగన్ ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వాలు ఉదాహరణలుగా చెప్పారు. ఈ రెండు ప్రభుత్వాలకు సిమిలారిటీస్ కూడా ఉన్నాయన్నారు. ఢిల్లీ విద్యా విధానంతో అక్కడి ప్రభుత్వం మోసం చేసిందన్నారు. వైద్యం పేరుతో కూడా అక్కడ ప్రజలను మోసం చేసిందన్నారు.
తాగు నీరును కూడా అక్కడి ప్రభుత్వం అందించ లేదని, డ్రైనేజీ, మంచి నీళ్లు కలిసిపోయాయని అన్నారు. ఢిల్లీలో ఎక్కడ చూసిన దుమ్ముతో నిండిపోడం వల్ల చెత్త పేరుకొని పోయిందన్నారు. కాలుష్యం కూడా పెరిగి పోయిందన్నారు. ఇదంతా ఢిల్లీ ప్రభుత్వ వైఫల్యం వల్లనే తలెత్తిందన్నారు. ఢిల్లీ సిటీ ఆఫ్ గార్బేజీ అయ్యిందన్నారు. ఒక సీజన్‌లో ఢిల్లీలోని పొల్యుషన్ తారా స్థాయికి చేరిందన్నారు. మోస్ట్ పొల్యూటెడ్ సిటీగా ఢిల్లీ మారిందని అన్నారు. ఇదంతా ఢిల్లీ ప్రభుత్వం చేపట్టిన పాలన మోడల్ అని, ఇది ఫెయిల్యూర్ పాలనా మోడల్ అని అన్నారు. ఇది అన్ని వేళల్లో సాధ్యం కాదన్నారు. ఈ రకమైన పాలన కొనసాగడం కష్టమన్నారు. కొనసాగితే నష్టాలే ఉంటాయన్నారు. ఈ నేపథ్యంలో ఆప్ పాలనను తిరస్కరించి.. బీజేపీకి ఢిల్లీ ప్రజలు పట్టం గట్టారని చంద్రబాబు అన్నారు.