రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు తన భార్యనూ వాడుకున్నారన్న సజ్జల!
అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబు చెడ్డ పేరు తెచ్చారు. వ్యవస్థలను అవినీతిమయం చేయటం, మీడియా ద్వారా ప్రజలను తప్పు దోవ పట్టించటంలో ఆరితేరారు
ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రసంగాలు రాసిస్తున్నారా? ఆమె చెప్పే ప్రసంగాలకు చంద్రబాబు నుంచి స్క్రిప్ట్ వెళుతోందా? అంటే అవుననే అంటున్నారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. షర్మిల మాట్లాడే భాషను ప్రజలు గమనిస్తున్నారు. ‘షర్మిల మాట్లాడే స్క్రిప్ట్ మొత్తం చంద్రబాబు వద్ద నుంచే వస్తోంది. దేశానికి అవినీతిని పరిచయం చేసిందే చంద్రబాబు. రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు తన భార్యను కూడా వాడుకున్నారు’ అని కామెంట్స్ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు మోసాలు ప్రజలకు అర్థమయ్యాయి కాబట్టే 2019 టీడీపీని ఓడించారన్న సజ్జల రామకృష్ణారెడ్డి జన్మభూమి కమిటీలతో చంద్రబాబు దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. ‘మహాదోపిడి అనే పుస్తకంలో చంద్రబాబు వ్యవస్థలను ఎలా మేనేజ్ చేశారో విజయబాబు స్పష్టంగా రాశారు. కేంద్ర, రాష్ట్ర నిధులను ఎలా దోచేశారో క్లియర్‌గా చెప్పారు. రాజకీయం అంటే దోపిడీ అన్నట్టుగా చంద్రబాబు వ్యవహరించారు. చంద్రబాబు అధికారం కోసం పవన్, బీజేపీని వాడుకుంటున్నారు. అధికారం చంద్రబాబు ఆఖరి ప్రయత్నం చేస్తున్నారు’ సజ్జల.
మహాదోపిడి పుస్తకావిష్కరణ సభలో మాట్లాడిన సజ్జల ఇంకా ఏమన్నారంటే చంద్రబాబు అవినీతిని వ్యవస్థీకృతం చేశారు. అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబు చెడ్డ పేరు తెచ్చారు. వ్యవస్థలను అవినీతిమయం చేయటం, మీడియా ద్వారా ప్రజలను తప్పు దోవ పట్టించటంలో చంద్రబాబు ఆరితేరారు. తన పాలనలో కేంద్ర, రాష్ట్ర నిధులను చంద్రబాబు మింగేశారు. చంద్రబాబు అంతటి అవినీతి పరుడు లేరని ప్రధాని సైతం విమర్శించారు. మరి ఆయనతో బీజేపీ ఎలా పొత్తు పెట్టుకుంది? అని ప్రశ్నించారు.
‘ప్రతికూల శక్తులన్నీ కలిస్తే అది చంద్రబాబు. అధికారం కోసం ఎంతకైనా దిగజారుతారు. రాష్ట్రాన్ని అప్పడంలా నమిలి మింగేయటానికి చంద్రబాబు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. చంద్రబాబు అవినీతి పరాకాష్ఠకు చేరినందునే 2019లో జనం ఓడించారు. ఐఎంజీ భారత్ పేరుతో చేసిన స్కాం ఇంటర్నేషనల్ క్లాసిక్ స్కాం అని తెలంగాణ హైకోర్టు సైతం అభిప్రాయపడింది. లక్ష రూపాయల పెట్టుబడితో వచ్చిన ఒక కంపెనీకి ఐదు రోజుల్లోనే 400 ఎకరాలను కేటాయించారు. వేల కోట్ల దోపిడీకి ఆ రోజుల్లోనే చంద్రబాబు ప్లాన్ చేశారు. అమరావతి స్కాం లాంటిదే ఐఎంజీ స్కాం కూడా. అంతకుముందు కుప్పంలో ఇజ్రాయిల్ సాగు పేరుతో ఒక స్కాం చేశారు. నీరు-చెట్టు పేరుతో దోపిడీ చేశారు. జన్మభూమి కమిటీల దోపిడీ ఏ ఇంట్లో అడిగినా చెబుతారు. ఇలాంటి అవినీతిపరుల విషయంలో ప్రజలే తగిన నిర్ణయం తీసుకోవాలి. షర్మిలకు స్క్రిప్ట్ ఎక్కడి నుంచి వస్తుందో అందరికీ తెలుసు అన్నారు’ సజ్జల.