గల్లాపెట్టలో గల్లా లేదు
పరుగెత్తి..పరుగెత్తి పని చేయాలని ఉంది. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ఉంది..కానీ గల్లా పెట్టె సహకరించడం లేదని సీఎం చంద్రబాబు అన్నారు.;
గత ఐదేళ్లల్లో ఆదాయం పెరగ లేదు. సంపద పెరగ లేదు. సంపద సృష్టించబడ లేదు. అప్పులు విపరీతంగా చేశారు. గత ఐదేళ్లల్లో రూ. 10 లక్షల కోట్ల అప్పులు చేశారు. ఆ ఆప్పులకు వడ్డీలు కట్టాలి. అసలు కట్టాలి. ఇప్పుడు అప్పులోళ్లను చూస్తోంటే భయమేస్తోంది. మొన్నైతే అప్పు కట్ట లేదని మా ఆఫీసుకు టకామని నోటీసులిచ్చారు. డబ్బులు కట్ట లేదు కాబట్టి.. ఆ అప్పులు రికవరీ చేయడానికి ఏమి చేయాలో అది చేస్తామని నోటీసులు ఇచ్చారు. దీని కోసం ఇమ్మిడియట్‌గా అప్పులు చేయాల్సి వచ్చింది. దాంతో అప్పులు కట్టాల్సి వచ్చింది.
అప్పులు కట్టక పోతే ఎవరు అప్పులు ఇవ్వరు. అప్పులు కట్టక పోతే సంక్షేమ కార్యక్రమాలు చేయలేం.. అంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు. నెల్లూరు జిల్లా కందుకూరు మండలం దూబగుంటలో ‘స్వచ్ఛ ఆంధ్ర–స్వచ్ఛ దివస్’ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. క్రిడిబులిటీ కోసం అప్పులు కడుతున్నాం. అలా విశ్వసనీయత ఉంటేనే తిరిగి అప్పులిస్తారని అన్నారు. పరుగెత్తి..పరుగెత్తి పని చేయాలని ఉంది. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ఉంది..కానీ గల్లా పెట్టె సహకరించడం లేదని సీఎం చంద్రబాబు అన్నారు. అందుకే రూ. 1600 కోట్లతో గుంతలు లేని రోడ్లు చేస్తున్నాం.