హిందీ మీద చంద్రబాబు హాట్ కామెంట్స్
త్రిభాషా విధానం మీద సీఎం చంద్రబాబు మాట్లాడుతున్న సయమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నవ్వుతూ కనిపించారు.;
తమిళనాడు వంటి దక్షిణాది రాష్ట్రాలు త్రిభాషా విధానాన్ని వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వేదికగా త్రిభాషా విధానంపై కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం చెబుతున్న త్రి భాషా విధానం మంచిదే అన్నట్లుగా సపోర్టు చేస్తూ మాట్లాడారు. త్రి భాషా విధానంపై తమిళనాడు అనవసర రాజకీయాలు చేస్తోందనే అర్థం వచ్చే విధంగా.. భాషల మీద అనవసర రాజకీయాలు వద్దంటూ పరోక్షంగా తమిళనాడు ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ సీఎం చంద్రబాబు మాట్లాడారు.
హిందీ నేర్చుకుంటే తప్పేముందని, ఢిల్లీ వంటి ఇతర రాష్ట్రాలకు వెళ్లినప్పుడు అక్కడ మాట్లాడేందుకు హిందీ దోహదపడుతుందని మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో హిందీ గురించి మాట్లాడుతున్న సమయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నవ్వుతూ కనిపించారు. ఇదే సందర్భంలో ఇంగ్లీషు గురించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. గత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఇంగ్లీషు నేర్చుకుంటేనే నాలెడ్జి వస్తుంది అన్నట్లుగా మాట్లాడారని, అది మంచిది కాదన్నట్లుగా వ్యాఖ్యలు చేశారు.