ఏపీకి సహకరించండి ప్లీజ్
16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగడియాతో భేటీ అయిన చంద్రబాబు.. రెండు గంటల పాటు సమావేశం అయ్యారు.;
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగడియాతో సోమవారం భేటీ అయ్యారు. దాదాపు రెండు గంటల పాటు సమావేశం అయ్యారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక స్థితి గతులకు సంబందించిన పలు కీలక అంశాలపై చర్చించారు. గత ఐదేళ్లల్లో ఆర్థిక పరిస్థితులు, ప్రస్తుతం ఆర్థిక స్థితి గతులపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌ను గట్టెక్కించేందుకు తాజాగా చేపట్టాల్సిన అంశాలపై డిస్కస్ చేశారు. ఏపీ ఆదాయం తక్కువుగా ఉండటం, జీడీపీ తక్కువుగా ఉండటం, దానికి గల కారణాలపైన అనర్గళంగా రెండు గంటల పాటు చంద్రబాబు ప్రజెంటేషన్ ఇచ్చారు. అప్పులు కూడా తిరిగి చెల్లించే పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ లేదని వివరించారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఆర్థిక స్థితి గతులను పరిశీలించి సాహాయం చేసేందుకు సహకరించాలని సీఎం చంద్రబాబు అరవింద్ పనగడియాను కోరారు.