కుప్పంలో గలగల పారుతున్న కృష్ణా జలాలు
రేపు కుప్పంకు సీఎం చంద్రబాబు. శనివారం పరమసముద్రం చెరువులో జలహారతి.;
కుప్పం బ్రాంచ్ కాలువలో కృష్ణా జలాలు బిరబిరా ప్రవహిస్తున్నాయి. ఇవి హంద్రీనీవా కాలువకు కొత్త కళ తెచ్చింది. శాంతిపురం మండలంలోని పరమసముద్రం చెరువు కృష్ణా జలాలతో తొణికిసలాడుతోంది.
కృష్ణాజలాలకు హారతి, సారె సమర్పించడానికి రెండు రోజుల పర్యటన కోసం సీఎం ఎన్. చంద్రబాబు శుక్రవారం కుప్పం చేరుకుంటారు. పరమసముద్రం చెరువు వద్ద శనివారం జలహారతి ఇస్తారు. ఈ చెరువు నుంచి కుప్పం, పలమనేరులోని 110 చెరువులను అనుసంధానం చేయడానికి మార్గం ఏర్పడిందని ఇంజినీరింగ్ అధికారులు చెబుతున్నారు.
హంద్రీనీవా కాలువ వెంబడి అధికారులు, ప్రజల సందడి
కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం తుమ్మిసి గ్రామం సమీపంలో కాలువ వద్ద ప్రత్యేకంగా ఘాట్ ఏర్పాటు చేశారు. దీనికి దగ్గరలోనే 18 అడుగుల చిరస్మరణీయ జ్ణాపకంగా పైలాన్ నిర్మిస్తున్నారు. కాలువలో నీటి లోతు పరిశీలించడం, పరిసర ప్రాంతాలను ఆకర్షణీయంగా తీర్చదిద్దడానికి జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆగస్టు 29 బెంగళూరు విమానాశ్రమ నుంచి బయలుదేరి సాయంత్రం ఆరు గంటలకు శాంతిపురం మండలం తుమ్మిసి గ్రామం వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ చేరుకుంటారు.
శాంతిపురం మండలంలో కడపల్లి వద్ద నిర్మించుకున్న సొంత ఇంటిలోనే రాత్రికి సీఎం చంద్రబాబు బస చేస్తారు.
ఆగస్టు 30 ఉదయం పది గంటలకు కడపల్లెలోని స్వగృహం నుంచి బయలుదేరుతారు.
ఉదయం 10 . 30 గంటలకు హంద్రీనీవా కాలువ ప్రవహించే పరమసముద్రం గ్రామ సమీపంలోని చెరువు వద్దకు చేరుకుంటారు. అక్కడ జలహారతి సమర్పిస్తారు.
ఉదయం 11 .15 గంటలకు పరమసముద్రం చెరువు సమీపంలో బహిరంగ సభలో మాట్లాడతారు.
మధ్యాహ్నం 11.20 గంటలకు అవగాహన ఒప్పందాల కార్యక్రమం.
మధ్యాహ్నం 11.50 గంటలకు బహిరంగ సభ
మధ్యాహ్నం రెండు గంటలకు పారిశ్రామిక వేత్తలు, విశిష్ట అతిథులతో సమావేశం.
మధ్యాహ్నం 3.45 గంటలకు రోడ్డు మార్గంలో బహిరంగ సభ నుంచి పరమ సముద్రం గ్రామం సమీపంలోని హెలిపాడ్ వద్దకు చేరుకుంటారు.
మధ్యాహ్నం 3.55 గంటలకు హెలికాప్టర్ లో బయలుదేరుతారు.
సాయంత్రం 4.40 గంటలకు బెంగళూరుకు చేరుకుంటారు.
కాలువవద్ద స్నానఘట్టం తరహా ఏర్పాట్లు
చెరగని గుర్తుగా...
శాంతిపురం మండలం పరమసముద్రం చెరువు వద్ద నిర్మిస్తున్న పైలాన్