‘చంద్రబాబు నువ్వు మనిషివా.. శాడిస్టువా’.. జగన్ సంచలన వ్యాఖ్యలు

పూతలపట్టులో నిర్వహించిన ‘మేమంతా సిద్ధం’ బహిరంగ సభలో చంద్రబాబుపై సీఎం జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నువ్వు మనిషివా.. శాడిస్టువా అంటూ పరుష పదజాం వినియోగించారు.

Update: 2024-04-03 15:59 GMT
Source: Twitter

‘‘నువ్వు మనిషివా శాడిస్టువా.. అవ్వాతాతల్ని ఇంత వేదనకు గురిచేస్తున్నావ్’’ అంటూ టీడీపీ అధినేత ఎన్ చంద్రబాబు నాయుడు టార్గెట్‌గా సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మండిపడ్డారు. పేదలు, ప్రభుత్వం మధ్య బాబు ఒక సైంధవుడిలా మారి అర్హులకు రావాల్సిన పథకాలు రాకుండా అడ్డుకుంటున్నారంటూ ధ్వజమెత్తారు. తన మనుషుల చేతే కేసులు వేయించి వృద్ధులు, వికలాంగులకు రావాల్సిన పెన్షన్లను అడ్డుకున్న దుర్మార్గుడు చంద్రబాబు అంటూ తీవ్ర పదజాలంతో దూషించారు జగన్ మోహన్ రెడ్డి. పెన్షన్ల పంపిణీకి వాలంటీర్లను దూరంగా ఉంచాలన్న ఎన్నికల సంఘం నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించడాన్ని సీఎం జగన్ తనకు అణుగునంగా మార్చుకున్నారు.

ప్రజలను తనవైపు తిప్పుకోవడానికి ఈ అవకాశాన్ని కూడా జగన్ వినియోగించుకున్నారు. భవిష్యత్తులో కూడా మీ పెన్షన్, ప్రభుత్వ పథకాలు ఇంటికే రావాలంటే మీ బిడ్డ జగన్‌కే ఓటేయాలంటూ ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేశారు జగన్. పొత్తులు-జిత్తులు-ఎత్తులే చంద్రబాబుది ఫార్ములా అని పూతలపట్టులో నిర్వహించిన బహిరంగ సభలో జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. నిమ్మగడ్డ చేత ఈసీకి లేఖ రాయించి వాలంటీర్ల వ్యవస్థను అడ్డుకున్నారని, ప్రజలకు ప్రభుత్వ పథకాలు రాకుండా చేస్తున్నారని మండిపడ్డారు.


ప్రజల పక్షానే నేను

ఈ ఎన్నికలు జగన్‌కు, చంద్రబాబుకు మధ్య జరుగుతున్న యుద్ధం కాదని సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇది విశ్వసనీయత, మోసం, నిజం, అబద్దం మధ్య జరుగుతున్న కురుక్షేత్రం. ఇందులో ఒకవైపు ప్రజలు, మరోవైపు చంద్రబాబు ఉన్నారు. ఇందులో నేను ప్రజల పక్షాన ఉన్నాను. ఓటేసిన గెలిపించిన ప్రజలకు అబద్దం, మోసం, అన్యాయం, తిరోగమనం, చీకటిని రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన చంద్రబాబు మన ముందే ఉన్నారు. అతనితో పోరాటినికి నేను సిద్ధం. ఒక్కడిని ఓడించడానికి అంతా కలిసి కట్టుగా వస్తున్నారు. అన్ని పార్టీలు, జెండాలు, అజెండాలు ఏకమై నన్ను ఓడించడానికి కుట్రలు, కుతంత్రాలు పన్నుతున్నారు. పేదల వ్యతిరేకులు, పెత్తందార్లను ఓడించడానికి మీరు సిద్ధమా? మీరు వేసే ఒక్క ఓటుపై రాష్ట్ర ఐదేళ్ల భవిష్యత్తు ఆధారపడి ఉంది’’అని ప్రజలకు పిలుపునిచ్చారు జగన్.
చంద్రబాబు అంటే గుర్తొచ్చేవి అవే
చంద్రబాబు పేరు చెప్తే ఏ ఒక్క పథమైనా గుర్తొస్తుందా? అని జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు అండ్ కో హయాంలో ఎప్పుడైనా.. ఏదైనా.. ప్రజలకు పనికొచ్చే పని చేశారా? వారి హయాంలో జరిగిన అభివృద్ధి ఏమైనా ఉందా? అంటూ ప్రశ్నలు కురిపించారు. ‘‘వాళ్లు ఎప్పుడైనా చెప్పి హామీలు, ప్రకటించిన మేనిఫెస్టోను పూర్తిగా అమలు చేశారా. ప్రజలను ఎప్పుడూ మాటలతో మోసం చేసి దగా చేశారే తప్ప ఇచ్చిన హామీలను నెరవేర్చిన దాఖలాలు వారి హయాంలో ఏన్నడూ లేవు. ఇన్ని సార్లు అధికారంలోకి వచ్చారు. ఎప్పుడైనా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చారా? మేనిఫెస్టోను అమలు చేశారా? ప్రతిసారీ మీరు ప్రజలను మోసమే చేశారు. ఇచ్చిన హామీలను 90 శాతం అమలు చేసిన ఏకైక ప్రభుత్వం మాదే’’అని వ్యాఖ్యానించారు.

అవన్నీ చేదింది ఎవరు.. మీ జగన్
చంద్రబాబు చెప్పడానికి ఎక్కడలేని హామీలు ఇచ్చారని, ఖాతాల్లో డబ్బులు వేస్తామని చెప్పారని, మరి ఒక్క రూపాయి అయినా ఎవరి ఖాతాలో అయినా వేశారా అని జగన్ అన్నారు. ‘‘వార్డు, సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ప్రభుత్వ బడుల ఆధునీకరణ, విలేజ్ క్లీనిక్‌లు, వాలంటీర్ వ్యవస్థ, మహిళల రక్షణ కోసం దిశ యాప్ తెచ్చింది ఎవరు.. మీ జగన్. వీటన్నింటినీ భవిష్యత్తులో కూడా కొనసాగించాలంటే మే 13న జరిగే ఎన్నికల్లో మా ప్రభుత్వానికి మీ మద్దతు కావాలి. దేశంలో రూ.3వేల పెన్షన్ ఇస్తున్న ఏకైనా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. పేదల ఖాతాల్లో రూ.2.70 లక్షల కోట్లు జమ చేశాం. మరి పేదలు, అక్క చెల్లెమ్మలు, అవ్వాతాతలను రక్షించడానికి మీరంతా సిద్ధమా’’అని ప్రజలను ఉత్తేజపరిచారు.
చంద్రబాబు చెప్పినవన్నీ అవాస్తవాలేనని, 2014లో రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి తీరా అధికారంలోకి వచ్చాయ రైతులకు మొండిచేయి చూపారని ధ్వజమెత్తారు. డ్వాక్రా రుణమాఫీ అన్నారని, రూపాయి కూడా మాఫీ చేయలేదని గుర్తు చేశారు. ఆడబిడ్డ పుడితే రూ.25 వేలు అందిస్తామని చెప్పారని, కానీ అది కాగితాలకే పరిమితమైపోయిందని, ఇంటింటికి ఉద్యోగం లేదా నిరుద్యోగభృతి ఇస్తానని అన్నారు.. ఇచ్చారా? అని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన కొన్ని రోజుల తర్వాతనే తాను భృతి ఇస్తానని చెప్పలేదని, ఉపాధి కల్పిస్తానని అన్నానని మాట మార్చిన పెద్ద మనిషి చంద్రబాబు కాదా? అని ప్రశ్నించారు సీఎం జగన్.


Tags:    

Similar News