ఆంధ్రాకు ప్రత్యేక హోదా, కాంగ్రెస్ ఎన్నికల హామీ

ప్రధాన పార్టీలు మర్చిపోయినపుడు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా డిమాండ్ ను తెరమీదకు తీసుకురావడం విశేషం.

Update: 2024-04-05 07:21 GMT

ఆంధ్ర ప్రదేశ్ కు స్పెషల్ క్యాటగరి స్టేటస్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. రాష్ట్ర విభజన ముందు 2014 ఫిబ్రవరి 20 వ తేదీన ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని దానిని అమలుచేస్తామని కాంగ్రెస్ పార్టీ ఈ రోజువిడుదల చేసిన లోక్ సభ ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొంది.

2019 ఎన్నికలలో అన్ని తెలుగుదేశం పార్టీ, వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలు ప్రత్యేక హోదా (Special category status) తెస్తామని, ఆ మేరకు కేంద్రం మీద వత్తిడి తెస్తామని ప్రకటించాయి. అయితే, ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. వైఎస్ ఆర్ కాంగ్రెస్ గెలిచింది. అయితే, ఈ పార్టీ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సఖ్యత గా ఉంటూండటంతో ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించడం మానేసింది. కేంద్రంలో ప్రధాని మోదీ ప్రభుత్వం చాలా బలంగా ఉందని, అందువల్ల ప్రత్యేక హోదా గురించి ప్రస్తుతం కేంద్రంతో పోరాడే స్థితిలో లేమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించి, ఆచా ప్టర్ క్లోజ్ చేశారు. తెలుగుదేశం పార్టీ కూడా 2019 ఎన్నికలు అయిపోయిన మరుసటి రోజునుంచి మోదీ స్నేహ హస్తం కోసం ఎదురుచూస్తున్నారు. అందువల్ల ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు కూడా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా డిమాండ్ చేయడం మానేసింది. అటు వైఎస్ ఆర్ కాంగ్రెస్, ఇటు తెలుగుదేశం ప్రధాని మోదీని ఇరుకున పెట్టే ఏ డిమాండ్ ను చేసే స్థితిలో లేవు.

ఈ దశలో కాంగ్రెస్ ప్రత్యేక హోదా డిమాండ్ ను లేవనెత్తింది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షత బాధ్యతలు స్వీకరించిన తర్వాత వైఎస్ షర్మిల ప్రత్యేక హోదా ను ఎన్నికల డిమాండ్ గామార్చేశారు. ఈ అంశం మీద ఆమె ఎన్నికల క్యాంపెయిన నిర్వహిస్తున్నారు.

ఇపుడు కాంగ్రెస్ పార్టీ జాతీయ మ్యానిఫెస్టో లో ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించింది. మ్యానిఫెస్టోల కేంద్ర రాష్ట్ర సంబంధాల మీద కూర్చిన అధ్యాయంలో ఈ విషయం ప్రస్తావించింది.

ఇదే విధంగా 1991 గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ ఢిల్లీ చట్టాన్ని సవరించి, లెఫ్టినెంట్ జనరల్ ఢిల్లీ క్యాబినెట్ సలహా మేరకు నడుచుకునేలా చేస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.

మ్యానిఫెస్టోలోని మరొక ముఖ్యాంశం కేంద్ర పాలిత ప్రాంతమయిన పుదుచ్చేరి కి రాష్ట్ర హోదా కల్పిస్తానని హామీ ఇవ్వడం.


Tags:    

Similar News