ఏపీలో సైబర్‌ క్రైమ్‌ రేటు పెరిగింది

ఆంధ్రప్రదేశ్‌ వార్షిక క్రైమ్‌ నివేదికను విడుదల చేశారు. ప్రాపర్టీ అఫెన్సెస్‌ కూడా పెరిగాయని డీజీపీ చెప్పారు.

Update: 2024-12-28 13:14 GMT

ఆంధ్రప్రదేశ్‌లో సైబర్‌ నేరాలు ఆందోళన కలిగిస్తున్నాయని, గత ఏడాది కంటే ఈ సంవ్సరం సైబర్‌ క్రైమ్‌ రేటు పెరిగిందని ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు చెప్పారు. ఈ ఏడాదిలో 916 సైబర్‌ కేసులు నమోదయ్యాయని, దాదాపు రూ. 1,229 కోట్ల నగదును సైబర్‌ నేరగాళ్లు కాజేశారని తెలిపారు. శనివారం మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో వార్షిక క్రైమ్‌ రిపోర్టును విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోయిన ఏడాదితో పోల్చితే ఈ సంవత్సరంలో ఓవరాల్‌ క్రైమ్‌ రేటు 5.2 తగ్గిందన్నారు. ప్రాపర్టీ నేరాల్లో గత ఏడాది కంటే ఈ సంవత్సరం క్రైమ్‌ రేటు పెరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో సైబర్‌ క్రైమ్‌ పట్ల ప్రజల్లో అవేర్‌నెస్‌ పెంచాల్సిన అవసరం ఉందన్నారు. డిజిటల్‌ అరెస్టులపై ప్రజలు ఆందోళనలు చెందాల్సిన అవసరం లేదన్నారు. డిజిటల్‌ అరెస్టుల కాల్స్‌ వస్తే తక్షణమే పోలీసులకు సమచారం అందించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో 10,837 ఎకరాల్లో గంజాయికి సాగుకు బదులుగా మారు పంటలు వేయించామన్నారు. గంజాయికి సంబంధించి పది పోలీసు స్టేషన్‌లకు ఒక డ్రోన్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఫింగర్‌ ప్రింట్స్‌ ఐడెంటిఫికేషన్‌ సిస్టమ్‌ను అందుబాటులోకి తెచ్చామన్నారు. సోషల్‌ మీడియాకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 576 కేసులు నమోదు చేసినట్లు చెప్పారు.

Tags:    

Similar News