దగ్గుబాటి రైటర్ కాని రచయిత

దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రపంచ చరిత్ర ఆది నుంచి నేటి వరకు పుస్తక ఆవిష్కరణ సభ విశాఖపట్నం గీతం యూనివర్శిటీలో జరిగింది.;

Update: 2025-03-06 08:56 GMT

నారా చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఇద్దరూ ఎన్టీఆర్‌ తోడళ్లుల్లు. తొలుత కలిసే ఉన్నారు. టీడీపీలో కీలక పదవులు చేపట్టారు. తర్వాత విభేదాలు తలెత్తాయి. ముప్పై ఏళ్లకుపైగా దూరంగా ఉన్నారు. మూడు దశాబ్దాల తర్వాత ఒకే వేదికపై ఆసీనులయ్యారు. ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఈ సంఘటన విశాఖపట్నంలో గురువారం చోటు చేసుకుంది. దగ్గుబాటి రచించిన పుస్తక ఆవిష్కరణ సభ దీనికి వేదికగా మారింది. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబుతో పాటు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, ఎంపీ భరత్, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఇతర పెద్దలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రసంగం వేదిక మీద కూర్చున్న వారితో పాటు సభలో ఉన్న పేక్షకుల మధ్య కూడా నవ్వులు పూయించాయి. వారి మధ్య అనుబంధం, దగ్గుబాటి విశేషాలు చెబుతూ తాను నవ్వడంతో పాటు అందరినీ నవ్వించే ప్రయత్నం చేశారు. తోడల్లుడి పుస్తుక ఆవిష్కణకు ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు ప్రత్యేక విమానంలో విశాఖ వచ్చారు.

చంద్రబాబు మాట్లాడుతూ..
దగ్గుబాటి వెంకటేశ్వరరావు తన తోడల్లుడని, ఇద్దరం ఎన్టీఆర్‌ దగ్గర అన్నీ నేర్చుకున్నామని, ఎన్టీఆర్‌ తమకు అప్పజెప్పిన బాధ్యతలను ఇద్దరం కలిసి నెరవేర్చామని సీఎం చంద్రబాబు అన్నారు. తమ కుటుంబంలో దగ్గుబాటి ఓ విశిష్టమైన వ్యక్తి అని అన్నారు. దగ్గుబాటి పుస్తకం రాస్తారంటే ఆశ్చర్య పోయానని, 40 ఏళ్లు కలిసున్నామని, కుటుంబ సభ్యులమని, దగ్గుబాటిలో సబ్జెక్టు మీద ఇంత డెప్ట్‌ ఉందని ఇప్పుడే తెలుస్తోందని అన్నారు. ఈ పుస్తకం మీరే రాశారా? అని దగ్గుబాటినే అడిగానన్నారు. దగ్గుబాటి రైటర్‌ కాదని, రైటర్‌ కాని రచయితని కితాబిచ్చారు.
ప్రపంచ చరిత్రను దగ్గుబాటి రాశారని అన్నారు. దగ్గుబాటి వృత్య రీత్యా వైద్యుడని, కానీ ప్రాక్టీస్‌ చేయలేదని, మంత్రిగా ఉండి వైద్యుడిగా ప్రాక్టీస్‌ చేశారని చెప్పారు. డాక్టర్‌గా చదవి సినిమాలు తీసారు. అంటే ఒక జీవితంలో ఏ విధంగా ఉంటాయనే దానికి దగ్గుబాటి జీవితం ఒక ఉదాహరణ అని అన్నారు. రాజకీయాల్లో ఉండి పుస్తకాలు రాయడం గొప్ప విషయమన్నారు. తమ కుటుంబంలో చాలా జోవియల్‌గా ఉండే వ్యక్తి దగ్గుబాటి అని అన్నారు. ఇటీవల కలిసినప్పుడు రాజకీయాల్లో నిరంతరం బిజీగా ఉండే వ్యక్తి ఇప్పుడు ఇంత రిలాక్స్‌డ్‌గా ఎలా ఉన్నారని అడిగానని, తనకు కూడా అలాంటి పరిస్థితులు వస్తే ముందుగా దాని కోసం ప్రిపేర్‌ కావలని అలా అడిగానన్నారు. నిద్ర లేచిన తర్వాత బాడ్మింటన్‌ ఆడుతాను, తర్వాత పిల్లలతో సరదగా గడుపుతాను, తర్వాత ఫ్రెండ్స్‌తో సరదాగా స్పెండ్‌ చేస్తాను, మళ్లా పేకాటకు పోతాను, పేకాటతో మైండ్‌ స్టిమ్యులేట్‌ అవుతుంది, పిల్లలకు స్టోరీలు చెబుతూ హాయిగా నిద్ర పోతానని తనతో దగ్గుబాటి చెప్పారని నవ్వుతూ చెప్పారు. ఇప్పటి వరకు దగ్గుబాటి ఐదు పుస్తకాలు రాశారని చెప్పారు. విభజన సమయంలో తెలుగువారి చరిత్ర వేర్పాటు వాదం మీద మంచి పుస్తకాన్ని రాశారని అన్నారు. మూర్తి రెండో అబ్బాయికి విజయవాడ సిద్ధార్థ కాలేజీలో సీటివ్వలేదని, నేనడిగితే సీటివ్వలేదు, నీ కంటే గొప్ప ఇనిస్టిట్యూట్‌ పెడుతా అని మూర్తి గీతం విద్యా సంస్థను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ఇది నమ్మడానికి శక్యం కాదని, తనతో మూర్తి చెప్పిన వాస్తవమని చెప్పారు.
1978లో తాను మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఇద్దరం ఒకే సారి అసెంబ్లీలో అడుగు పెట్టామని, అదే పంచకట్టు అదే తీరు ఇప్పటికీ వెంకయ్యనాయుడు సొంతమని సీఎం చంద్రబాబు అన్నారు. చిన్న గ్రామంలో పుట్టినా అత్యున్నత స్థానానికి చేరుకున్న గొప్ప వ్యక్తి వెంకయ్యనాయుడు అన్నారు. భారత దేశంలో చాలా మంది ఆర్థిక మంత్రులను చూశాం.. ఫైనాన్స్‌ మినిస్టర్‌ అంటే నిర్మలా సీతారామన్‌లా ఉండాలని సీఎం చంద్రబాబు కితాబిచ్చారు. దేశ సేవలో నిర్మలా సీతారామన్‌ పునీతమయ్యారని పేర్కొన్నారు.
Tags:    

Similar News