అమరావతిలో బుల్డోజర్ దూకుడు...

ఏపీలో కక్ష రాజకీయాలు మొదలయ్యాయా? వైఎస్ జగన్ ప్రజా వేదికను కూల్చారు. తెలుగుదేశం ప్రభుత్వం నిర్మాణంలో ఉన్న వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యాయలయాన్ని కూల్చివేసింది.

Update: 2024-06-22 11:59 GMT

ఆంధ్రప్రదేశ్ లో కక్ష రాజకీయాలకు పార్టీలు తెరలేపాయి. శనివారం ఉదయం తాడేపల్లి సీతానగరంలోని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యాలయాన్ని తెలుగుదేశం ప్రభుత్వం జెసీబీల సాయంతో కూల్చివేసింది. దాదాపు 50 శాతం నిర్మాణం పూర్తయిన కార్యాలయ భవనాన్ని కూలగొట్టారు. మునిసిపాలిటీ, సీఆర్డీఏ అనుమతి తీసుకోకుండా నిర్మాణం చేపట్టారని ప్రభుత్వం చెబుతోంది. అనుమతులు లేకుండా నిర్మాణం చేపట్టారని, దీనిని ఎందుకు కూల్చ కూడదో వివరించాలని శుక్రవారం వైఎస్సార్సీపీ వారికి మునిసిపల్ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే శనివారం ఉదయం ఐదున్నర గంటలకే జేసీబీలు తీసుకొచ్చి మునిసిపల్ అధికారులు దగ్గరుండి కూలగొట్టారు.

కామన్ గా మారిన కక్ష సాధింపులు

కక్ష సాధింపులు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కామన్ గా మారినట్లు ప్రచారం జరుగుతోంది. వైఎస్సార్సీపీ అక్రమంగా నిర్మిస్తున్న పార్టీ భవనాలపై తెలుగుదేశం ప్రభుత్వం దృష్టి సారించింది. విశాఖపట్నంలోని ఎండాడ వద్ద నిర్మిస్తున్న వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయ నిర్మాణం కూడా అనుమతులు లేకుండా మొదలు పెట్టారని, వెంటనే సమాధానం ఇవ్వాలని కార్పొరేషన్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ముందుగా రాష్ట్ర కార్యాలయం కూల్చివేతతో పార్టీ కార్యాలయాల కూల్చివేతల కార్యక్రమం మొదలైందని వైఎస్సార్సీపీ వారు ఆరోపిస్తున్నారు.

ఎందుకు కూల్చివేశారు..

తాడేపల్లిలోని మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సీతానగరం కొండపక్కన ఇరిగేషన్ శాఖకు సంబంధించిన 17 ఎకరాల ఖాళీ స్థలం ఉంది. అందులో రెండెకరాలు స్థలాన్ని వైఎస్సార్సీపీ 33 సంవత్సరాలకు లీజుకు తీసుకుంది. ఇందులో పది సెంట్ల పరిధిలో పార్టీ కార్యాలయ నిర్మాణం చేపట్టారు. బేస్మెట్ వేసి ఒక శ్లాబ్ వేశారు. ఆ తరువాత రెండో శ్లాబ్ వేసేందుకు పిల్లర్లు పోశారు. ఇప్పటి వరకు వైఎస్సార్సీపీ కార్యాలయం అద్దె భవనంలో ఉన్నందున దానిని మార్చేందుకు నూతన భవన నిర్మాణం చేపట్టారు. ఇరిగేషన్ శాఖకు చెందిన ఖరీదైన స్థలాన్ని వైఎస్సార్సీపీ వారు నామినల్ లీజుకు తీసుకున్నరనే దానిపై జన సేనకు చెందిన నాయకుడొకరు కోర్టులో పిటీషన్ వేశారు. శుక్రవారం హైకోర్టులో పిటీషన్ విచారణకు వచ్చింది. ప్రస్తుతం ఏ విధంగా ఉందో అలాగే ఉంచాలని, పూర్తి విచారణ జరిగిన తరువాత నిర్ణయం తీసుకుంటామని కోర్టు చెప్పింది. ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం అనుమతులు ఉన్నందునే తాము పార్టీ ఆఫీస్ కడుతున్నరన్నామని వైఎస్సార్సీపీ వారు అంటున్నారు. సర్వే నెం: 202/A1 లో ఉన్న ఈ భూమి ఇకపై ప్రభుత్వ పరిధిలో ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.

Delete Edit

ఆంధ్రప్రదేశ్ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు చంద్రబాబు నాయుడు దిగారు. తాడేపల్లిలో దాదాపు పూర్తి కావొచ్చిన వైఎస్సార్సీపీ స్టేట్ ఆఫీస్ ను బుల్డోజర్లతో కూల్చివేయించారు. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేశారని ఏపీ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు.

విశాఖ ఆఫీస్ కు నోటీసులు

విశాఖపట్నంలోని ఎండాడలో నిర్మిస్తున్న వైఎస్సార్సీపీ కార్యాలయం అనుమతులు లేకుండా కడుతున్నారని, ఎందుకు ఈ విధంగా చేశారో వివరణ ఇవ్వాలని విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు నోటీసులు ఇచ్చారు. వారం రోజుల్లో సరైన సమాధానం ఇవ్వకపోతే తదుపరి చర్యలు ఉంటాయని విశాఖ జోన్ 2 టౌన్ ప్లానింగ్ అధికారులు వైఎస్సార్సీపీ కార్యాలయానికి నోటీసులు అంటించారు. వెంటనే పనులు ఆపివేయాలని నోటీస్ లో పేర్కొన్నారు.

మచిలీపట్నంలోనూ అలజడి

కృష్ణాజిల్లా మచిలీపట్నం పోలీస్ పేరేడ్ గ్రౌండ్ లో అధునాతన సదుపాయాలతో నిర్మాణం పూర్తి కావొచ్చిన వైఎస్సార్సీసీ కార్యాలయం పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. ఇక్కడి మున్సిపాలిటీలో మూజువాణి ఓటుతో పోలీసు గ్రౌండ్ లోని రెండు ఎకరాల స్థలంలో వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయ నిర్మాణం చేపట్టారు. నిజానికి ఈ భూమి పోలీసు శాఖది. పోలీసు శాఖపై ఒత్తిడి తెచ్చి.. పురపాలక సంఘం పాలక మండలి అనుమతితో ఈ నిర్మాణం చేపట్టారు. ఈ భూమిపై పురపాలక సంఘానికి అధికారం లేదు. పైగా 99 తొమ్మిదేళ్లు లీజుకు ఇస్తూ పురపాలక సంఘం పాలక మండలి ఆమోదం తెలపడం అభ్యంతరకరమని అప్పట్లో టీడీపీ వాదించింది. కానీ అధికార బలంతో ఈ భూమిని వైఎస్సార్సీపీ స్వాధీనం చేసుకుంది. ఇదే స్థలంలో ప్రజలకు ఉపయోగపడే రీతిలో భోగరాజు సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి యూనియన్ బ్యాంకు ముందుకు వస్తే భూమి ఇవ్వలేదు. ఈ కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణానికి ఎంపీ బాలశౌరి కృషి చేశారు. కానీ బాలశౌరిపై వ్యతిరేకతతో అప్పటి ఎమ్మెల్యే పేర్నినాని అడ్డుకున్నారు. ఈ స్థితిలో బందరు పోలీసు పేరేడ్ గ్రౌండ్ లో వెలిసిన వైసీపీ కార్యాలయంపై ప్రభుత్వం దృష్టి సారించినట్టు సమాచారం. ఎన్టీఆర్ సీఎం హయాంలో పోలీసు కుటుంబాల సంక్షేమం కోసం క్వార్టర్స్ నిర్మించారు. ఇవన్నీ ఇప్పుడు శిథిలావస్థకు చేరుకున్నాయి. ప్రస్తుత స్థలంలో పోలీస్ క్వార్టర్స్ కట్టకపోయినా ఈ మైదానంపై వచ్చే ఆదాయంతో పోలీసు శాఖకు సంక్షేమ నిధికి ఊరట లభించేది. కానీ ఒక రాజకీయ పార్టీ ఆఫీస్ నిర్మాణానికి ఇంత స్థలం అవసరమా? అనే చర్చ కూడా మొదలైంది.

Tags:    

Similar News