TIRUMALA | శ్రీవారికి 16 నుంచి సుప్రభావ సేవ రద్దు

ధనుర్మాసం ప్రారంభం అవుతుంది. శ్రీవారికి 17వ తేదీ నుంచి ఏకాంతంగా తిరుప్పావై నిర్వహిస్తారు.;

Byline :  SSV Bhaskar Rao
Update: 2024-12-10 13:36 GMT
తిరుమల శ్రీవారి ఆనందనిలయం

తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైంది ధనుర్మాసం ఈ నెల 16వ తేదీ ప్రారంభం కానుంది. ఆ రోజు ఉద‌యం 6.57 గంటలకు ధనుర్మాస ఘడియలు ప్రారంభం అవుతాయని టీటీడీ పండితులు తెలిపారు. దీంతో డిసెంబరు 17వ తేదీ నుంచి స్వామివారికి నిర్వహించే సుప్రభాతసేవ స్థానంలో తిరుప్పావై ప్రవచనాలు నివేదిస్తారని టీటీడీ ప్రకటించింది. ఈ ధనుర్మాస ఘడియంలు 2025 జనవరి 14న ధనుర్మాస ఘడియలు ముగుస్తాయని వివరించారు.

ఇందులో ప్రత్యేకత ఏమిటంటే, రోజూ వేకువజామున, పవళింపు సేక కార్యక్రమాలు భోగశ్రీనివాసుడికి నిర్వహించడం ఆనవాయితీ. ధనుర్మాసంలో ఆయనకు బదులుగా శ్రీకృష్ణస్వామివారికి ఏకాంతసేవ నిర్వహిస్తారు. ఈ కార్యక్రమం ఏకాంతంగా నిర్వహిచడం వల్ల జనవరి 14వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ రద్దు చేశారు. ఆ సమయంలో వీఐపీలకు కూడా దర్శనం టికెట్లు జారీ చేయరు. కాగా,
శ్రీవారికి ఏమి నివేదిస్తారంటే..
శ్రీ‌వారి సన్నిధిలో ధ‌నుర్మాసం సంద‌ర్భంగా విశేష కైంక‌ర్యాలు నిర్వ‌హిస్తారు. అందులో ప్రధానంగా బిల్వ ప‌త్రాల‌తో స‌హ‌స్ర నామార్చ‌న చేస్తారు. శ్రీ‌విల్లి పుత్తూరు నుంచి అందించే చిలుకలను రోజూ స్వామివారికి అలంక‌రిస్తారు. ధ‌నుర్మాసం సంద‌ర్భంగా శ్రీ‌వారికి విశేష నైవేద్యాలుగా దోశ‌, బెల్లం దోశ‌, సుండ‌లు, సీరా, పొంగ‌ల్ వంటి ప్ర‌సాదాలు ప్రత్యేంగా నివేదిస్తారు.
విశేష ప్రాధాన్యం
ధనుర్మాసానికి ఉన్న ప్రాధాన్యతపై టీటీడీ వేదపండితులు ఏమి చెబుతున్నారంటే... పురాణాల ప్రకారం ధనుర్మాసంలో దేవతలు సూర్యోదయానికి ఒకటిన్నర గంట ముందుగా నిద్రలేస్తారు. బ్రహ్మముహూర్తంలో దేవతలంతా శ్రీమహావిష్ణువును ప్రత్యేకంగా ప్రార్థిస్తారు. అందువల్ల ఈ మాసానికి సౌరమానంలో ప్రత్యేక ప్రాధాన్యం ఉందని చెబుతున్నారు.
ఆండాళ్‌ తిరుప్పావై పారాయణం
శ్రీవెంకటేశ్వరస్వా వైభవాన్ని 108 దివ్యదేశాల్లో విస్తృత ప్రచారం చేయడంలో ఆళ్వారులు (భక్తులు) ప్రధానమైన ప్రచారకులు. 12 మంది ఆళ్వార్లలో ఆండాళ్‌ (గోదాదేవి) ఒకరు. ఈమెను నాచియార్‌ అని కూడా పిలుస్తారు. శ్రీవేంకటేశ్వరస్వామివారిని స్తుతిస్తూ ఆండాళ్‌ రచించిన 30 పాశురాలను కలిపి తిరుప్పావై అంటారు. ఆళ్వార్‌ దివ్యప్రబంధంలో తిరుప్పావై ఒక భాగం. తమిళ సాహిత్యంలో దీనికి విశేష ప్రాచుర్యం ఉంది. శ్రీవారి ఆలయంలో నెల రోజులపాటు జరిగే తిరుప్పావై పారాయణంలో రోజుకు ఒకటి వంతున అర్చకులు నివేదిస్తారు. ఈ సందర్భంలో సాధారణంగా భోగశ్రీనివాసమూర్తికి బదులుగా శ్రీకృష్ణస్వామివారికి ఏకాంతసేవ నిర్వహిస్తారు. ఈ తిరుప్పావై పఠనం పూర్తిగా ఏకాంతంగా జరుగుతుంది.
Tags:    

Similar News