నీ భర్త ఎవరంటూనే.. శాంతీపై మరో ఆరు అభియోగాలు..

దేవాదాయశాఖ సహాయ కమిషనర్ శాంతికి మరో షాక్ తగిలింది. తన భర్త ఎవరో చెప్పాలంటూ దేవాదాయ శాఖ కమిషనర్ సత్యానారణ నోటీసులు జారీ చేశారు.

Update: 2024-07-22 08:26 GMT

దేవాదాయశాఖ సహాయ కమిషనర్ శాంతికి మరో షాక్ తగిలింది. తన భర్త ఎవరో చెప్పాలంటూ దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ నోటీసులు జారీ చేశారు. 15 రోజుల్లో సమాధానం ఇవ్వాలని కూడా నోటీసుల్లో పేర్కొన్నారు. 2020లో ఉద్యోగంలో చేరినప్పుడు సర్వీస్ రిజిస్టర్‌లో తన భర్త పేరు మదన్‌హోహన్ అని శాంతి పేర్కొన్నారు. 2023లో ఆమె ప్రసూతి సెలవులు తీసుకున్న సమయంలో కూడా మదన్ మోహన్ పేరే చెప్పారామే. కానీ తాజాగా ఈ నెల 17న నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాత్రం తాను సుభాష్‌ను వివాహమాడినట్లు వెల్లడించారామే. దీంతో కమిషనర్ సత్యనారాయణ చార్జ్ తీసుకున్నారు. మొదట భర్తతో విడాకులు తీసుకోకుండా మరొకరిని వివాహం చేసుకోవడం ఉద్యోగుల ప్రవర్తన నియమావళికి విరుద్దమని, కావున ఆమె భర్త ఎవరు అన్న అంశంపై శాంతి స్పష్టత ఇవ్వాలని కోరుతూ ఆయన నోటీసులు జారీ చేశారు. ఈ అంశంపై శాంతి 15 రోజుల్లో తన సమాధానాన్ని అందించాలని, ఇది దేవాదాయ శాఖ ప్రతిష్ఠకు సంబంధించిన విషయమని కూడా ఆయన పేర్కొన్నారు.

అయితే ఆమెపై వస్తున్న అభియోగాల నేపథ్యంలో దేవాదాయశాఖ శాంతిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ సమయంలో శాంతిపై తొమ్మిది అభియోగాలు ఉన్నాయి. తాజాగా ఆమెపై మరో ఆరు కొత్త అభియోగాలను నమోదైనట్లు సమాచారం. ఈ క్రమంలోనే శాంతి పాల్పడిన ఉల్లంఘనలపై ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు చెప్తున్నారు.

కొత్త అభియోగాలు ఇవే

1) విధుల్లో చేరినప్పుడు భర్త పేరు మదన్‌మోహన్ అని నమోదు చేసుకుని.. ఆయనకు విడాకులు ఇవ్వకుండా వేరొకరిని వివాహం చేసుకున్నట్లు వెల్లడించడం.

2) తన తీరుతో దేవాదాయశాఖ ప్రతిష్టకు భంగం కలిగించారు.

3) శాఖ కమిషనర్ అనుమతి లేకుండా విలేకరుల సమావేశం నిర్వహించడం.

4) వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి గురించి గతేడాది మే 28న చేసిన ఎక్స్(ట్విట్టర్) పోస్ట్ ఆ పార్టీతో శాంతికి ఉన్న అనుబంధాన్ని సూచిస్తుందని, ప్రభుత్వ ఉద్యోగిగా ఇది నిబంధనలకు విరుద్ధం.

5) విశాఖలో నివాసం ఉన్నప్పుడు అపార్ట్‌మెంట్లోని మరో ఫ్లాట్ నివాసితులతో గొడవ జరగగా 2022 ఆగస్టులో అరిలోవ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయించడం.

6) అధికారం లేకపోయినా విశాఖపట్నం జిల్లా పరిధిలో వివిధ ఆలయాలకు చెందిన దుకాణాలు, భూముల లీజులను రెన్యువల్ చేసేలా కమిషనర్‌కు ప్రతిపాదనలు పంపడం.. అవి రెన్యువల్ కావడం.

Tags:    

Similar News